కంగనా బాడీగార్డ్ మీద రేప్ కేసు.. పెళ్లి పేరుతో దారుణంగా..తల్లి చేత ఫోన్ చేయించి ?
గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న కంగనా రనౌత్ మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈ సారి మాత్రం ఆమె ప్రమేయం లేకుండానే వార్తల్లోకెక్కారు. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాడీగార్డ్ మీద ఒక రేప్ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే

కంగనా బాడీ గార్డ్ రేప్
చాలా సంవత్సరాలుగా కంగనా పర్సనల్ బాడీ గార్డ్ గా పని చేస్తున్న కుమార్ హెగ్డే అనే వ్యక్తి మీద రేప్ కేసు నమోదైనట్లు సమాచారం. తనను కుమార్ హెగ్డే రేప్ చేశారంటూ బాలీవుడ్ కి చెందిన ఒక మేకప్ ఆర్టిస్ట్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు బుక్ అయినట్లు తెలుస్తోంది. ఈ అంశం ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఎనిమిదేళ్లుగా
బాలీవుడ్లో మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న యువతితో గత ఎనిమిదేళ్లుగా కుమార్ సహజీవనం చేస్తున్నారని తెలుస్తోంది. ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని నమ్మించి కుమార్ లొంగ తీసుకున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడితే మాత్రం కుమార్ అసలు ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది.

ఫోన్ చేసి బెదిరింపులు
అంతేకాక ప్రేమలో ఉన్నామని చెబుతూ తన వద్ద నుంచి కుమార్ కొంత డబ్బు కూడా తీసుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే కుమార్ తల్లి తనకు ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకు రావద్దని బెదిరిస్తున్నట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె పోలీసులను కోరింది.

ఆ సెక్షన్స్ కింద కేసు
అయితే ఈ అంశం మీద పోలీసులు మాత్రం ఆసక్తికరంగా స్పందించారు అసలు ఆయన ఎక్కడ పని చేస్తున్నాడు అనే విషయం తమకు తెలియదని చెప్పుకొచ్చారు. కుమార్ హెగ్డే అనే వ్యక్తి మీద 376, 378 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన యువతి కుమార్ ఇద్దరూ కొన్నాళ్లపాటు సహజీవనం చేసి విడిపోయారని ఆయన పేర్కొన్నారు.
Recommended Video

కంగనా ఏమంటుందో
నిజానికి కంగనా వద్ద పనిచేసిన హెయిర్ స్టైలిస్ట్ అలిస్టర్‌పై కూడా గతంలో అత్యాచార ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 2020లో మైనర్ బాలికపై అత్యాచార కేసులో పోక్సో చట్టం కింద పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.మరి సినిమా ఇండస్ట్రీ సహా అన్ని విషయాల గురించి స్పందిస్తూ అందరినీ నిలదీసే కంగనా తన పర్సనల్ బాడీగార్డ్ చేసిన నిర్వాకం గురించి ఏమని స్పందిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











