ఎవరితో పడుకొన్నానో ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టు.. యువ తారలా? రణ్‌బీర్, అలియాపై కంగన ఫైర్

బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ మరోసారి తన నోటికి పనిచెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ కపూర్, అలియాభట్‌పై విరుచుకుపడింది. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్, ఆలియా మధ్య అఫైర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరి లైంగిక జీవితం, వారిద్దరి మధ్య ఉన్న వయసు తేడా గురించి దారుణమైన వ్యాఖ్యలను కంగన రనౌత్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

రణ్‌బీర్, అలియా యువతారలా?

రణ్‌బీర్, అలియా యువతారలా?

రణ్‌బీర్, అలియా భట్‌ను యువ తారలు అనడాన్ని తప్పుపట్టింది. 37 ఏళ్ల వయసు ఉన్న రణ్‌బీర్, 27 ఏళ్ల వయసున్న అలియాభట్ యువతారలు అని ఎలా ప్రశ్నిస్తారు. 27 ఏళ్ల వయసులో నా తల్లి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. వారిద్దరిని యువ తారలు అనడం శుద్ధ తప్పు అని కంగన కామెంట్లు విసిరింది.

 నా సెక్సువల్ లైఫ్ గురించి

నా సెక్సువల్ లైఫ్ గురించి

నీ లైంగిక జీవితం గురించి నీవు మాట్లాడుకుంటే అభ్యంతరం ఉండదు. నా సెక్సువల్ లైఫ్‌ గురించి మాట్లాడొద్దు. ఒకవేళ మాట్లాడలనుకొంటే.. నేను ఎవరితో పడుకొంటున్నానో.. లేదా పడుకోవడం లేదో ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టు. దేశం మొత్తానికి ఎవరేంటో క్లియర్‌గా తెలుస్తుంది అని కంగన మండిపడింది.

 గుడ్డిగా ప్రేమలో మునిగి

గుడ్డిగా ప్రేమలో మునిగి

రణ్‌బీర్, అలియా తమ మధ్య ఉన్న వయసు వ్యత్యాసాన్ని మరిచిపోయినట్టు ఉన్నారు. వారిద్దరూ గుడ్డిగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. కరణ్ జోహర్, రణ్‌బీర్ కపూర్, అలియాభట్ తమకు తాము గొప్ప అనుకొంటారు. వారు మిగితా భాషల్లో పీకిందేమీలేదని కంగన విమర్శించారు.

నన్ను వాళ్లు టార్గెట్ చేస్తున్నారు

నన్ను వాళ్లు టార్గెట్ చేస్తున్నారు

బాలీవుడ్‌లో ప్రముఖులమని చెప్పుకొని తిరిగే కొందరు నాపై దుష్ఫ్రచారం చేస్తున్నారు. నా గురించి చాలా మంది చెడుగా మాట్లాడుతున్నారు. నేనేదైనా మంచి చేస్తే దానిపై నెగిటివ్‌ కామెంట్లు చేస్తున్నారు. సినిమా వారసత్వం లేకుండా నేను ఇండస్ట్రీలో నిలబడగలిగాను. నాకు బంధుప్రీతి, బయట వ్యక్తి అనే మాటలతో దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని కంగన అన్నారు.

నా సక్సెస్ చూసి హీరోలకు గుండెదడ

నా సక్సెస్ చూసి హీరోలకు గుండెదడ

నేను హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ సక్సెస్ సొంతం చేసుకోవడం కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. నా సినిమాలు తను వెడ్స్ మను, మణికర్ణిక సినిమాలు బ్లాక్‌బస్టర్లు కావడంతో హీరోల్లో అభద్రతభావం నెలకొన్నది. అందుకే నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు అని కంగన ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X