మణికర్ణిక ఫస్ట్ లుక్: కదనరంగంలో కంగన సింహ గర్జన!
బ్రిటిష్ వారిపై 1857 లో వీరనారి ఝాన్సీ లక్ష్మి భాయి తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా మణికర్ణిక చిత్రం తెరకెక్కుతోంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మి భాయిగా ఈ చిత్రంలో నటిస్తోంది. తెలుగు దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నాడు.
నేడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మణికర్ణిక ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చరిత్రలో చెప్పుకున్న విధంగా కొడుకుని వీపుపై కట్టుకుని కదనరంగంలో కంగనా రనౌత్ సింహ గర్జన చేస్తూ కనిపిస్తోంది. విభిన్న తరహా పాత్రల్ని ఛాలెంజ్ గా తీసుకుని తాను ఏంటో కంగనా ఎప్పుడూ నిరూపించుకుంటూనే ఉంది.

పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ చిత్రంపై అంచనాలు పెంచే విధంగా ఉంది. ఈ చిత్రానికి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథని అందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 25 న విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











