బ్రేకింగ్: ముంబైలో అడుగుపెట్టిన క్వీన్.. కంగనకు వై సెక్యూరిటీతోపాటు రక్షణగా మరో దళం

వివాదాలు, ఉద్రిక్తత పరిస్థితుల మధ్య బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్‌ ముంబైలో అడుగుపెట్టారు. మనాలి నుంచి ముంబైకి చేరుకొన్న కంగన రనౌత్‌ కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శివసేన నేతల హెచ్చరికల కారణంగా కంగన రనౌత్‌కు రక్షణను ఏర్పాటు చేశారు. కంగన రౌనత్ ముంబైలో అడుగు పెట్టిన క్రమంలో చోటు చేసుకొన్న పరిణామాలు ఇలా ఉన్నాయి.

శివసేన హెచ్చరికలతో

శివసేన హెచ్చరికలతో

లాక్‌డౌన్‌లో మనాలీలో ఉన్న కంగన రనౌత్ తన సహచర నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం దర్యాప్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై పోలీసుల తీరును ఎండగట్టారు. ఈ క్రమంలో ముంబైలో ఉండే హక్కు కంగనకు లేదని హెచ్చరించారు. వారి వ్యాఖ్యలపై మండిపడుతూ.. సెప్టెంబర్ 9న ముంబై వస్తున్నాను.. ఎవడి అయ్యాకు దమ్ముంటే నన్ను ఆపండి అంటూ సవాల్ విసరడంతో ఈ వ్యవహారం ఉద్రిక్తంగా మారింది.

ముందుస్తు జాగ్రత్తగా ఎయిర్‌పోర్టులో

ముందుస్తు జాగ్రత్తగా ఎయిర్‌పోర్టులో

ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ నటి కంగన రనౌత్ రాక సందర్భంగా ముంబైలోని చత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టులో భారీగా పోలీసులను మోహరింప చేశారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా కేంద్ర, రాష్ట్రాల భద్రతాదళాలను ఎయిర్‌పోర్టులో నియమించారు.

వై క్యాటగిరి భద్రతతో ముంబైకి

వై క్యాటగిరి భద్రతతో ముంబైకి

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వై క్యాటగిరి భద్రతతో కంగన రనౌత్‌ ముంబై ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టారు. ఆమె ముంబై వస్తున్న నేపథ్యంలో మీడియా పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టులో మోహరించింది. ముంబైలో అడుగుపెట్టడానికి ముందే తన భవనాన్ని బీఎంసీ కూల్చివేసేందుకు చేసిన ప్రయత్నాలపై మండిపడ్డారు.

హైడ్రామా మధ్య ముంబైకి కంగన

హైడ్రామా మధ్య ముంబైకి కంగన

ముంబైలో అడుగుపెట్టిన కంగన రనౌత్‌కు వై సెక్యూరిటీతోపాటు కర్ణిసేన కార్యకర్తలు కూడా రక్షణ కల్పించేందుకు ముందుకొచ్చారు. కర్నిసేన కార్యకర్తలు కూడా ఆమెకు ఎస్కార్డుగా ఉండటానికి సిద్ధమయ్యారు. ఇలాంటి హై డ్రామా మధ్య కంగన రనౌత్ తన నివాసానికి చేరుకొన్నారు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
మంగళవారం రాత్రి పూర్వీకుల గ్రామంలో బస

మంగళవారం రాత్రి పూర్వీకుల గ్రామంలో బస

కంగన రనౌత్ ముంబైకి చేరుకొనే ప్రయాణంలో భాగంగా మంగళవారం రాత్రే మనాలి నుంచి బయలు దేరి మండి జిల్లాలోని తన పూర్వీకులు గ్రామానికి చేరుకొన్నారు. తన పూర్వీకుల గ్రామంలోని పురాతన ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆమె వెంట సొదరితోపాటు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X