»   » వామ్మో.. బాలీవుడ్ ని తాకిన శ్రీరెడ్డి అర్థనగ్న నిరసన సెగ.. కంగనా రనౌత్ ఇలా!

వామ్మో.. బాలీవుడ్ ని తాకిన శ్రీరెడ్డి అర్థనగ్న నిరసన సెగ.. కంగనా రనౌత్ ఇలా!

Subscribe to Filmibeat Telugu
Kangana Ranaut Reacts On Sri Reddy Protest

శ్రీరెడ్డి టాలీవుడ్ లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. శ్రీరెడ్డి అర్థ నగ్న నిరసన జాతీయ వ్యాప్తంగా సెగలు రేపుతోంది. శనివారం రోజు శ్రీరెడ్డి టాలీవడ్ ఫిలిం ఛాంబర్ ఎదుట అర్థ నగ్నంగా నిలబడి నిరసన తెలియజేసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి నిరసన జాతీయ వ్యాప్తంగా పాకింది. ప్రముఖులు ఒక్కొక్కరుగా శ్రీరెడ్డి నిరశనపై స్పందిస్తున్నారు . కాస్టింగ్ కౌచ్, తెలుగు హీరోయిన్లకు అవకాశాల కోసం శ్రీరెడ్డి గత నెలరోజులుగా తన గళం వినిపిస్తోంది. శ్రీ రెడ్డి అర్థ నగ్న నిరసన గురించి బాలీవడ్ స్టార్ హెరోయిన్ కంగనా రనౌత్ స్పందించింది.

బాలీవుడ్‌ని తాకిన శ్రీరెడ్డి సెగ

బాలీవుడ్‌ని తాకిన శ్రీరెడ్డి సెగ

శ్రీరెడ్డి అర్థ నగ్న సెగ బాలీవుడ్ ని కూడా తాకేసింది. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి పోరాడుతున్న సంగతి తెలిసిందే. గత నెల రోజులుగా శ్రీరెడ్డి తన వాయిస్ వినిపిస్తోంది.ఎవరూ స్పందించక పోవడంతో తాను ఈ తరహా నిరసనకు దిగినట్లు శ్రీరెడ్డి వివరణ ఇచ్చింది.

సంచలన లీకులు

సంచలన లీకులు

శ్రీరెడ్డి ప్రస్తుతం ప్రతిరోజూ మీడియాలో కనిపిస్తోంది. టాలీవుడ్ ప్రముఖుల గురించి నర్మ గర్భంగా లీకులు ఇస్తూ సంచలనం సృష్టిస్తోంది. తన డిమాండ్లు నెరవేర్చకుంటే తన పోరాటాన్ని జాతీయ స్థాయికైనా తీసుకుని వెళతానని శ్రీరెడ్డి హెచ్చరిస్తోంది.

కంగనా రనౌత్ స్పందన

కంగనా రనౌత్ స్పందన

శ్రీరెడ్డి అర్థనగ్న నిరసనపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ స్పందించింది. నిరసన విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వలన సమస్య పక్కదోవ పడుతుంది కానీ ప్రయోజనం ఉండదని కంగనా తెలిపింది.

సమస్యనే హైలైట్ చేయాలి

సమస్యనే హైలైట్ చేయాలి

మనం పోరాడుతున్న సమస్య హైలైట్ అయ్యేలా చూడాలి తప్ప మనపై అందరి దృష్టి పడకూడదని, అప్పుడు అది పబ్లిసిటీ స్టంట్ గా మాత్రమే మిగిలిపోతుందని కంగన తెలిపింది.

ఇది సరైన మార్గం కాదు

ఇది సరైన మార్గం కాదు

నిరసన తెలిపే క్రమంలో బట్టలు విప్పేయాలనుకోవడం సరైన పద్దతి కాదని కంగనా అభిప్రాయ పడింది. సమస్యని హైలైట్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయని కంగన వివరించింది.

కాస్టింగ్ కౌచ్ నిజమే

కాస్టింగ్ కౌచ్ నిజమే

అన్ని చిత్ర పరిశ్రమల్లో కాస్టింగ్ కౌచ్ ఉన్న మాట వాస్తవమే అని కంగన అంగీకరించింది. అలాంటి ఇబ్బందులు తనకు కూడా ఎదురయ్యాయని కంగన తెలిపింది. దీనిపై పోరాడడానికి శ్రీరెడ్డి ఎంచుకున్న మార్గం మాత్రం సరైందని కాదు అని కంగన తెలిపింది.

 అవమానంగా భావిస్తారు

అవమానంగా భావిస్తారు

ఇండస్ట్రీలో అన్నిరకాల నటులు ఉంటారు. కొందరు సెన్సిటివ్ గా ఉండే వారు కూడా ఉంటారు. ఇలాంటి చర్యలవలన వారు అవమానంగా భావిస్తారు. నిరసన తెలిపేందుకు సరైన మార్గం ఎంచుకోవాలని కంగన సూచించింది.

English summary
Kangana Ranaut reacts on Sri Reddy strip protest. It is not a way of protest says Kangana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X