స్టార్ హీరోలైతే దానికి ఒప్పుకోవాలా? ఆయన ఫోన్ చేసి వాగితే గడ్డి పెట్టాను.. కంగన
బాలీవుడ్‌లో ఫైర్‌బ్రాండ్ యాక్టర్ కంగన రనౌత్ ప్రస్తుతం సోలో హీరోయిన్ పాత్రలతో సొంత స్టామినాను బాక్సాఫీస్ వద్ద పెంచుకొంటున్నారు. స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చిన పెద్దగా పట్టించుకోవడం లేదు. తన ఇమేజ్‌కు తగినట్టుగా సోలో స్టార్‌గా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఫోన్ చేసి ఇచ్చిన ఆఫర్‌ను మొహమాటం లేకుండా తిరస్కరించినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ దర్శక, నిర్మాత ఎవరంటే..

ఎలాంటి మొహమాటం లేకుండా
ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్, రణ్‌బీర్ కపూర్ నటించిన సంజూ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. అయితే ఎలాంటి మొహమాటం లేకుండా ఈ సినిమాలను రిజెక్ట్ చేశాను. సంజూ సినిమాలో నా రేంజ్‌కు తగిన పాత్ర లేకపోవడం వల్ల నేను ఒప్పుకోలేదు అని కంగన రనౌత్ చెప్పారు.

రణ్‌బీర్ ఇంటికి వస్తే
సంజూలో నన్ను నటించేలా ఒప్పించడానికి స్వయంగా రణ్‌బీర్ కపూర్ నా ఇంటికి వచ్చాడు. నన్ను ఆ సినిమాలో చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఆ పాత్రలో చేయడానికి ఏమీ లేదు. నాకు నచ్చలేదు. అందుకే చేయనని చెప్పాను. అలా రణ్‌బీర్‌కు నో అని చెప్పే హీరోయిన్ ఎవరైనా ఉంటారా? అని కంగన అన్నారు.

స్టార్ హీరోలైతే ఒప్పుకోవాలా?
నా కంటూ ఓ ఇమేజ్ ఉంది. నా నుంచి ప్రేక్షకులు ఏదో ఆశిస్తారు. కాబట్టి వారి అంచనాలకు తగినట్టుగా నేను పాత్రలను ఎంపిక చేసుకోవాలి. నేను, నా పోజిషన్ స్ట్రాంగ్‌గా ఉందంటే నేను చేసిన పాత్రలే అందుకు కారణం. నేను చేసే పాత్రల్లో ఏదో ఒక విషయం ఆకట్టుకొనేలా ఉండాలి. స్టార్ హీరోలు ఉన్నంత మాత్రాన వెంటనే ఒప్పేసుకోవాలా? అని కంగన చెప్పారు.
Recommended Video

సుల్తాన్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశా..
సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమాలో అనుష్క శర్మకు బదులుగా నన్నే అడిగారు. ఆదిత్య చోప్రా నాకు ఫోన్ కాల్ చేసి ఆఫర్ ఇచ్చారు. నేను చేయనని చెప్పాను. దాంతో నీతో జీవితంలో కలిసి పనిచేయనని చెప్పాడు. అయితే సరే అని ఫోన్ పెట్టేశాను. ఇలాంటి విషయాలు నా కెరీర్‌లో చాలానే జరిగాయి అని కంగన అన్నారు.


Click it and Unblock the Notifications











