సుశాంత్‌కు ఆ డర్టీ సీక్రెట్స్ తెలుసు.. అందుకే చంపేశారు.. కంగనా కామెంట్స్ వైరల్
సుశాంత్ సింగ్ కేసులో ప్రస్తుతం డ్రగ్ రాకెట్ చిక్కుకుంది. డ్రగ్స్ డీలర్స్‌తో రియాకు సంబంధాలు ఉన్నట్టు, వారితో కాంటాక్ట్ అయినట్టు ఆధారాలున్నట్టు సీబీఐ ప్రకటించింది. ఈ మేరకు నార్కోటిక్ బ్యూరో రియాపై కన్నేసింది. అయితే ఈ విషయంలో కంగనా ఎంట్రీ ఇచ్చి సంచలన కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా, వారు వాడే డ్రగ్స్ గురించి అన్ని విషయాలు చెబుతానని, కాకపోతే తనకు మాత్రం రక్షణ కల్పించాలని కంగన కోరింది.

ఎంతో మంది చిక్కుతారు..
బాలీవుడ్‌లోకి ఒకవేళ నార్కోటిక్ డిపార్ట్మెంట్ వెళితే.. పెద్ద పెద్ద వాళ్లు చిక్కుతారు. వారికి రక్త పరీక్షలు చేస్తే ఎందరో బయటకు వస్తారు. స్వచ్చ భారత్ కార్యక్రమం కింద వారినందరినీ ఊడ్చిపారేస్తారని నమ్ముతున్నాను. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నా మెంటర్ కూడా నాకు డ్రగ్స్ ఇచ్చేవాడు. అయితే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పకుండా ఉండేందుకు చిన్నగా నాకు వాటిని అలవాటు చేశారు.

కొకైన్ ఫేమస్..
ఇక నేను పాపులర్ అయ్యాక, పెద్ద పెద్ద పార్టీల్లోకి వెళ్లడం ప్రారంభించాక అసలు విషయాలు నాకు తెలిశాయి. బాలీవుడ్‌లోని డ్రగ్స్ మాఫియా, ఆ పాపపు ప్రపంచాన్ని కళ్లారా చూశాను.కొకైన్ బాలీవుడ్‌లో ఎక్కువగా వాడే డ్రగ్. ఈ డ్రగ్‌ను అన్నీ పార్టీల్లో వాడుతారు. అది చాలా కాస్ట్లీ కానీ పెద్దింటి పార్టీలకు వెళ్తే వారు ఫ్రీగానే ఇస్తారు. ఇక దాంట్లో మునిగితే సమయం గడిచింది కూడా తెలీదు.
Recommended Video

సుశాంత్‌కు తెలుసు..
నార్కోటిక్ బృందానికి సాయం చేసేందుకు రెడీగా ఉన్నాను. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి నాక సాయం కావాలి. ఎందుకంటే ప్రస్తుతం నా కెరీర్‌ను మాత్రమే కాదు నా లైఫ్‌ను కూడా ప్రమాదంలోకి నెట్టాను. సుశాంత్‌కు ఈ డర్టీ సీక్రెట్స్ తెలుసు కాబట్టే అతడిని చంపేశారు. నేను వాటిని చెబుతాను అంటూ కంగనా పేర్కొంది.

కంగనాకు రక్షణ కల్పించండి..
నిన్న సాయంత్రం నుంచి కంగనా చేసిన సంచలన కామెంట్స్‌కు నెటిజన్స్ మద్దతు తెలిపారు.అయితే తనకు ప్రాణ హాని ఉందని కంగనా చెప్పడంతో నెటిజన్స్ ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు. కంగనాకు రక్షణ కల్పించండి అనే హ్యాష్ ట్యాగ్‌ను నేషనల్ వైడ్‌గా ట్రెండ్ చేశారు.


Click it and Unblock the Notifications











