twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంగనాకు కుర్రహీరో చేతిలో ఘోర పరాభవం.. షోలు లేపేసి మరీ ఆ సినిమాకు?

    |

    కంగనా రనౌత్ అంటే తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించిన ఆమె ఎక్కువగా హిందీ సినిమాలకే పరిమితం అయింది. నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఆమె వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడంలో కూడా బాగా ఫేమస్ అయింది. తాజాగా 'ధాకడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె దారుణ స్పందన అందుకుంది..ఏకంగా జనాలు లేక షోలు క్యాన్సిల్ చేస్తున్నారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    మే 20న

    మే 20న


    వివాదాస్పద అంశాల మీద మరింత వివాదాస్పదంగా స్పందిస్తూ ఉండే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎక్కువగా 'క్వీన్', 'మణికర్ణిక' వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ ఓరియేంటేడ్ కథలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ క్రమంలోనే కంగనా తాజాగా నటించిన చిత్రం 'ధాకడ్'. ఈ మూవీ ట్రైలర్ విడుదలైనప్పుడు అది అభిమానులను మెప్పించలేకపోయింది. ఎట్టకేలకు స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ధాకడ్ థియేటర్స్‌లో మే 20న విడుదలైంది. అయితే సినిమాకు ఏ మాత్రం ప్రేక్షకాదరణ లభించడం లేదు.

    'భూల్ భులయ్యా-2' ఎఫెక్ట్

    'భూల్ భులయ్యా-2' ఎఫెక్ట్


    ఈ క్రమంలో 'ధాకడ్' బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. 'ధాకడ్'తో పాటు యువ హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన 'భూల్ భులయ్యా-2' కూడా విడుదలైంది. అయితే ఆ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సినిమా చూడాలనుకునేవారంతా 'భూల్ భులయ్యా-2' వెళుతూ ఉండడంతో ఆ ఎఫెక్ట్ 'ధాకడ్' సినిమా మీద పడింది. దీంతో 'ధాకడ్' సినిమా తొలిరోజు రూ. 50లక్షలను మాత్రమే వసూలు చేసింది.

     మరింత తగ్గే అవకాశం

    మరింత తగ్గే అవకాశం


    ఇక రెండో రోజు నుంచి కలెక్షన్లు మరింత తగ్గాయి. ఈ క్రమంలో 'ధాకడ్'కు కేటాయించిన షో లన్నింటిని క్యాన్సిల్ చేసి 'భూల్ భులయ్యా-2' తో రీప్లేస్ చేస్తున్నారని అంటూ బాలీవుడ్ హంగామా ఒక కధనాన్ని ప్రచురించింది. నిజానికి 'ధాకడ్' సినిమాను ముందు 2100 స్క్రీన్స్‌లో విడుదల చేశారు. అయితే మే 22 నాటికిజనాలు లేని కారణంగా 250 నుంచి 300 స్ర్కీన్స్‌లో తొలగించారు. మే 23 నుంచి ఈ స్క్రీన్స్ మరింత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

    3 రోజుల్లో 3.22 కోట్లు మాత్రమే

    3 రోజుల్లో 3.22 కోట్లు మాత్రమే


    నిజానికి కంగన సినిమాకు చాలా తక్కువ సింగిల్ స్క్రీన్స్ లభించాయి, అందులో కూడా థియేటర్‌కు 10 నుంచి 15 మంది ప్రేక్షకులు మాత్రమే వస్తున్నారు. అందువల్ల ఈ మూవీని తొలగిస్తున్నారు. మల్లీప్లెక్స్‌లు కూడా 'ధాకడ్'కు షోలు తగ్గిస్తున్నాయని అంటున్నారు. ఇక దాదాపు 100 కోట్లతో రూపొందిన 'ధాకడ్' 3 రోజుల్లో 3.22 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.

    కుర్ర హీరో చేతుల్లో పరాజయం

    కుర్ర హీరో చేతుల్లో పరాజయం


    కంగనా నటించిన 'మణికర్ణిక' మినహా, 2015 నుంచి ఆమెకు ఇది వరుసగా ఎనిమిదో ఫ్లాప్ చిత్రం. ఈ సినిమా రిజల్ట్ విషయంలో సోషల్ మీడియా యూజర్ల నుంచి రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి. కొందరు నెటిజన్లు కంగనాను ఎగతాళి చేయగా, మరికొందరు సినిమాల ఎంపికకు సంబంధించి సలహాలు ఇచ్చారు. ఇక ఒక స్టార్ హీరోయిన్ కుర్ర హీరో చేతుల్లో పరాజయం పాలవడం చర్చనీయాంశం అవుతోంది.

    English summary
    Kangana Ranaut Dhaakad Shows canceled due to zero audience and replaced with that of Bhool Bhulaiyaa
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X