హీరోయిన్ లగ్జరీ హౌస్ చూశారా? కళ్లు చెదిరిపోయేలా ఉంది (ఫోటోస్)

By Bojja Kumar

Recommended Video

Kangana ranaut Exposes Her Luxurious House In Manali

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తన హోమ్ టౌన్ మనాలిలో రూ. 30 కోట్ల ఖర్చుతో విలాసవంతమైన భవనాన్ని కట్టించుకున్న సంగతి తెలిసిందే. కంగనా మాన్షన్ ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ ఇంటికి సంబంధించిన కొన్ని ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చేశాయి. అయితే లోపల ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా ఉంది? ఎంత అందంగా తీర్చి దిద్దారు అనే దృశ్యాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. తాజాగా వీటిని కంగనా తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. కళ్లు చెదిరే డిజైన్స్, ఆశ్చర్యపరిచే కలర్ థీమ్‌తో ఎంతో అద్భుతంగా ఉంది.

హిమాలయాలకు సమీపంలో

కంగనా రనౌత్ ఇంటికి సంబంధించిన పూర్తి డీటేల్స్ దృశ్యాలతో సహా ‘ఆర్కిటెక్చరల్ డైజెస్' అనే మేగజైన్ జూన్ సంచికలో పబ్లిష్ చేయబోతోంది. సముద్ర మట్టానికి 2వేల అడుగుల ఎత్తులో హిమాలయాలకు సమీపంలో నిర్మించారు. ఈ ఇంటి బాల్కనీ నుండి బయటకు చూస్తే వెండి కొండలా మెరిస్తూ మంచు కొండలు కనువిందు చేస్తాయి.

ఇంటీరియల్ డిజైనింగ్ కోసం భారీ ఖర్చు

ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంటీరియల్ డిజైనింగ్ కోసం భారీగా డబ్బు, సమయం వెచ్చించారు. కబోర్డ్స్ దగ్గర నుండి ఫర్నీచర్, కలర్ థీమ్ ఇలా ప్రతి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 9 నెలలు డిజైనర్స్ కష్టపడితే తప్ప ఈ విలాసవంతమైన భవనానికి అదనపు సొగబులు అద్దడం పూర్తి కాలేదట. ఇందుకోసం సాంప్రదాయ మెటీరియల్ వాడారట.

ఇంటీరియర్ డిజైనర్ షబ్నమ్ గుప్తా

ఇంటీరియర్ డిజైనర్ షబ్నమ్ గుప్తా ఆధ్వర్యంలో ఈ ఇంటికి సంబంధించి డిజైనింగ్ వర్క్ జరిగిందని కంగనా రనౌత్ తెలిపారు. తనకు ఎలాంటి డిజైన్స కావాలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చానని, ఆమె అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చిందని కంగనా తెలిపారు. అన్ని పనులు పూర్తి చేసి 2017 నవంబర్లో తనకు ఇంటిని హ్యాండోవర్ చేసిందని తెలిపారు.

హిమాలయ పర్వతాల అందమైన వ్యూ

ఈ భవంతి నుండి చూస్తే హిమాలయ పర్వతాల అందమైన వ్యూ కనిపిస్తుందని, 8 బెడ్ రూములతో ఈ భవంతి నిర్మించినట్లు సమాచారం. ప్రతి రూముకు బాల్కనీ వచ్చేలా అద్దాల ద్వారా సూర్యరష్మి లోనికి వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారట.

మనాలిలో స్పెషల్ ఎట్రాక్షన్

ఇలాంటి బిల్డింగ్ ఇప్పటి వరకు మనాలీలో లేదు. లోకల్‌గా ప్రజలు, టూరిస్టులు ఈ ఖరీదైన భవంతి చూసేందుకు తరలి వస్తున్నారు. ఈ కట్టడం ముందు నిల్చుని సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X