క్రిష్ వదిలేశాక ఎన్ని ఇబ్బందులో... డబ్బులు ఎగ్గొటిన నిర్మాత, షూటింగ్ నిలిపివేత!
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం 'మణికర్ణిక' చిత్రంపై మరో వివాదం నెలకొంది. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించగా సినిమా చివరి దశలో ఉండగా అతడు తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో కంగనా రనౌత్ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ నిలిచి పోయింది. వర్కర్లు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులు ఆందోళనకు దిగడము ఇందుకు కారణం.
వర్కర్లకు, జూనియర్ ఆర్టిస్టులకు బకాయి పడ్డ రూ. 1.5 కోట్లు డబ్బులు చెల్లించకుండా నిర్మాతల ఇబ్బందులు పెడుతున్నారని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయూస్ (ఎఫ్‌డబ్ల్యుఐసిఇ) ఆరోపించింది.

షూటింగ్ నిలిపివేత
ఈ చిత్రం జనవరి 25న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించిన కొంత షూటింగ్ మిగిలి ఉండటంతో ప్రస్తుతం ముంబై ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుతున్నారు. అయితే వర్కర్లు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులు సమ్మె చేయడంతో షూటింగ్ ఆగిపోయింది.

మూడు నెలలుగా డబ్బులు ఇవ్వడం లేదు
మూడు నెలలు గడిచినా డైలీ వైజ్ వర్కర్లకు డబ్బులు చెల్లించలేదని, వీరికి మొత్తం రూ. 40 లక్షల వరకు చెల్లించాల్సి ఉందని... లైట్ వెండర్స్‌కు రూ. 90 లక్షలు, జూనియర్ ఆర్టిస్టులకు రూ. 25 లక్షలు చెల్లించాల్సి ఉందని, నిర్మాత కమల్ జైన్ అక్టోబర్లోనే చెల్లిస్తానని చెప్పి మాట నిలబెట్టుకోలేదని ఎఫ్‌డబ్ల్యుఐసిఇ జనరల్ సెక్రటరీ అశోక్ దూబే తెలిపారు.

మొహం చాటేస్తున్న నిర్మాత
సినిమాకు సంబంధించిన ప్యాచ్ వర్క్ కొంత మిగిలి ఉందని, నవంబర్ మొదటి వారంలోనే నిర్మాత కమల్ జైన్‌తో మాట్లాడామని, అయితే అప్పటి నుంచి అతడు తమ ఫోన్ కాల్స్ కు రెస్పాండ్ అవ్వడం మానేశాడని దూబే తెలిపారు. వర్కర్లకు, జూనియర్ ఆర్టిస్టులకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించే వరకు షూటింగ్ నిలిపివేస్తామని తెలిపారు.

సెన్సార్ బోర్డుకు లేఖ
త్వరలోనే ఎఫ్‌డబ్ల్యుఐసిఇ తరుపున మణికర్ణిక చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్న ప్రైమీ ఫోకస్ కంపెనీకి లేఖ రాయబోతున్నామని, తమకు రావాల్సిన డబ్బు వచ్చే వరకు క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ చేయవద్దని సెన్సార్ బోర్డుకు సైతం లేఖ రాయబోతున్నట్లు దూబే తెలిపారు.

షూటింగ్ సెట్లో వర్కర్ల దురవస్థ
నిర్మాత ఇప్పటికైనా వర్కర్లు, టెక్నీషియన్ల, జూనియర్ ఆర్టిస్టుల కష్టాలను అర్థం చేసుకోవాలని... ఇక్కడ సెట్స్‌లో ఎలాంటి సేఫ్టీ మెథడ్స్ పాటించడం లేదు. వర్కర్లకు ఎలాంటి ఇన్సూరెన్స్ కూడా లేదు. సెట్స్‌లో అందించే ఆహారం కూడా క్వాలిటీగా ఉండటం లేదని అశోక్ దూబె తెలిపారు. త్వరలోనే లేబర్ కమిటీ చైర్మన్‌ను కలిసి తమ సమస్యను వివరించబోతున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications











