twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మణికర్ణికకు ఎదురుదెబ్బ.. నిర్మాత ఆరోగ్య పరిస్థితి విషమం.. 5 రోజుల్లో సినిమా విడుదల!

    |

    వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మణికర్ణిక. క్రేజీ హీరోయిన్ కంగన రనౌత్ ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్ర ఎక్కువ భాగం క్రిష్ దర్శత్వంలో తెరకెక్కింది. విభేదాల కారణంగా ఈ చిత్రం నుంచి క్రిష్ తప్పుకున్నాడు. చిత్ర యూనిట్ మిగిలిన షూటింగ్ ని పూర్తి చేసింది. తాజాగా మణికర్ణిక చిత్ర యూనిట్ కి మరో షాక్ తగిలింది.చిత్ర నిర్మాత కమల్ జైన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇలా జరగడంతో చిత్ర యూనిట్ మొత్తం విషాదం నెలకొంది.

    ఆరోగ్య పరిస్థితి విషమం

    ఆరోగ్య పరిస్థితి విషమం

    జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రం విడుదలవుతోంది అన్న సమయంలో గత రాత్రి మణికర్ణిక నిర్మాత కమల్ జైన్ పక్షవాతానికి గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మణికర్ణిక చిత్ర యూనిట్ మొత్తం ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం కమల్ జైన్ ముంబైలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

    ఇది సరైన సమయం కాదు

    ఇది సరైన సమయం కాదు

    కమల్ జైన్ పక్షవాతానికి గురైన తర్వాత ఆయన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అభిమానులకు సందేశం వచ్చింది. నేను ఆసుపత్రిలో చేరడానికి ఇది సరైన సమయం కాదు అని నాకు తెలుసు. వీలైనంత త్వరగా కోలుకుని మీ అందరితో మణికర్ణిక సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొంటా అని ట్వీట్ చేశారు. ఆసుపత్రిలో చేర్పించాక కమల్ జైన్ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించినట్లు తెలుస్తోంది.

    <strong>‘మణికర్ణిక' చిత్రానికి కర్ణిసేన వ్యతిరేకం కాదు, ఎవరో కావాలనే ఇదంతా...</strong>‘మణికర్ణిక' చిత్రానికి కర్ణిసేన వ్యతిరేకం కాదు, ఎవరో కావాలనే ఇదంతా...

    వివాదాల నడుమ

    వివాదాల నడుమ

    మణికర్ణిక చిత్రానికి ఆరంభం నుంచి ఏదోఒక వివాదం, సమస్య ఎదురవుతూనే ఉన్నాయి. షూటింగ్ దశలో కంగన పలుమార్లు గాయాలపాలైంది. ఆ తర్వాత దర్శకుడు క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడు. సోనూసూద్ విషయంలో కూడా ఓ వివాదం సాగింది. సరిగ్గా విడుదలకు 5 రోజుల ముందు నిర్మాత జైన్ అనారోగ్యానికి గురికావడం ఇబ్బంది పెట్టె అంశమే. ఈ సమస్యని చిత్ర యూనిట్ ఎలా అధికమించి సినిమాని విడుదల చేస్తుందో చూడాలి.

    భారీ యాక్షన్ సన్నివేశాలు

    భారీ యాక్షన్ సన్నివేశాలు

    ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ సన్నివేయాలతో రూపొందించారు. ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కోసం కంగన రనౌత్ దాదాపు 2ఏళ్ల పాటు కష్టపడింది. విభిన్న చిత్రాల్లో తన నటనే ఆయుధంగా కంగనా రనౌత్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులని ఆకట్టుకుంది.

    English summary
    Kangana Ranaut’s Manikarnika producer Kamal Jain critical after paralytic stroke
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X