హీరో హీరోయిన్ పై కామెంట్: ... ‘ఆ ఇద్దరు పప్పులకు అంత సీన్ లేదు, కష్టపడటం చేతకాదు’

కంగనా రనౌత్ సోదరి రంగోళి చందల్ మరోసారి బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ మీద విరుచుకుపడ్డారు. 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో నటిస్తున్న ఈ జంటను ఉద్దేశించి 'పప్పూస్' అని వ్యాఖ్యానిస్తూ విమర్శలు చేశారు. కంగనా కష్టపడినంతగా వీరు కష్టపడలేరని, వీరికి అంత సీన్ లేదు అనే అర్థం వచ్చేలా ట్వీట్ల వర్షం కురిపించింది.

రణబీర్ కపూర్, అలియా భట్... గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోలను రంగోళి ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ... 'ఈ ఇద్దరు పప్పులు తమ లవ్ స్టోరీ మూవీ కోసం గుర్రపుస్వారీ నేర్చుకుంటున్నారు. ఒక్కరోజు ప్రాక్టీసుకే అలసిపోయారు. మళ్లీ నేర్చుకోవడానికి వెళ్లలేదు. కానీ కంగనా గుర్రపు స్వారీ నేర్చుకునే సమయంలో చాలా కష్టపడింది. మూడు సార్లు గాయపడింది. సంవత్సరం పాటు చెమటోడ్చింది. ఇండస్ట్రీ బయట నుంచి వచ్చిన వారిలా ఈ పప్పులకు అలా కష్టపడటం చేతకాదు, నేను చెప్పేది తప్పు అయితే వారు గుర్రపు స్వారీ చేస్తున్న ఒక్క వీడియో చూపండి'' అని పేర్కొన్నారు.

ఆ వీడియో లీకేజీకి ప్రతీకారమేనా?

కంగనా రనౌత్ సైతం గతంలో గుర్రపుస్వారీ అంశంపై కరణ్ జోహార్ మీద విమర్శలు చేసింది. ‘మణికర్ణిక-ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' సినిమాలో బొమ్మ గుర్రంపై కంగనా స్వారీ చేస్తున్న వీడియో ఆ మధ్య లీకైన సంగతి తెలిసిందే. తనను తప్పుడు ప్రచారం చేయడానికే కరణ్ జోహార్ అండ్ గ్యాంగ్ ఈ వీడియో లీక్ చేశారని కంగనా ఆరోపించారు. అలియా భట్, రణబీర్ ఇద్దరూ కరణ్ జోహార్ గ్రూపు కావడంతో రంగోళి ఇపుడు వారిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేశారు

అవకాశం వచ్చినప్పుడల్లా కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి.... రణబీర్ కపూర్, అలియా భట్, కరణ్ జోహార్ లాంటి వారిపై విరచుకుపడుతూనే ఉన్నారు. తనను ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేసిన వారిలో కరణ్ జోహార్ ఒకరు అంటూ పలు సందర్భాల్లో కంగనా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

అవకాశాలు రాకుండా చేశారా?

అవకాశాలు రాకుండా చేశారా?

అలియా భట్, రణబీర్ కపూర్ మీద కంగనా కోపానికి కారణం.... గతంలో తనకు రావాల్సిన అవకాశాలను అలియా భట్ తన్నుకెళ్లడమేనట. నటిగా ఎదగకుండా వ్యతిరేకులు చేసిన ప్రయత్నాలను అధిగమిస్తూ కంగనా రనౌత్ స్టార్ హీరోయిన్‌ స్థాయి సంపాదించింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఆమె అవకాశం వచ్చినప్పుడల్లా వారిపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

రణబీర్, అలియా నో కామెంట్

రణబీర్, అలియా నో కామెంట్

అయితే కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి చేస్తున్న ఈ కామెంట్లపై రణబీర్ కపూర్, అలియా భట్ ఇప్పటి వరకు స్పందించలేదు. తాము ఈ వివాదంపై స్పందించడం ద్వారా కంగనాకు అనవసర పబ్లిసిటీ ఇచ్చినవారం అవుతామనే ఉద్దేశ్యంతోనే వారు సైలెంటుగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X