మాల్ హై క్యా... స్టార్ కిడ్స్ కోడ్ లాంగ్వేజ్ ఇదే.. గుట్టు విప్పిన కంగన రనౌత్
బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పెద్ పెద్ద హీరోయిన్ల పేర్లు బయటకు వస్తున్నాయి. గత వారం సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ పేర్లు బయటకు వచ్చాయి. ఇక ఈ మధ్య శ్రద్దా కపూర్, దీపిక పదుకొణె పేర్లు వచ్చాయి. ప్రస్తుతం D, K పేర్లతో ఉన్న వాట్సప్ చాట్ రచ్చ రచ్చ జరుగుతోంది. ఇందులో D అంటే దీపికా పదుకొణె K అంటే ఆమె మేనేజర్ కరిష్మా అని తెలుస్తోంది. ఇక రియా చక్రవర్తిని సుధీర్ఘంగా విచారించిన తరువాత ఈ పేర్లన్నీ బయటకు వస్తున్నాయని తెలుస్తోంది.

ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి..
రియా చక్రవర్తిని ఎన్‌సీబీ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేస్తోన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆమె బయటపెడుతున్న లిస్ట్, వెల్లడిస్తున్న పేర్లు మీడియాలో అంతగా వైరల్ అవుతున్నాయి. అయితే రియా తాజాగా దీపికా పదుకొణె పేరును బయట పెట్టినట్టుగా జాతీయ మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. ఇక ట్విట్టర్‌లో అయితే దీపికపై అందరూ విరుచుకుపడుతున్నారు.

వాట్సప్ చాట్..
D, K మధ్యలో మాల్ ఉందా అంటూ జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాల్ హై క్యా అంటూ నెటిజన్లు కూడా తెగ ట్రోల్ చేస్తున్నారు. మాల్ ఉంది కానీ నేను ఇంట్లో లేను.. అమిత్ దగ్గర ఉంది కావాలా? అంటూ వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ హల్చల్ చేస్తోంది.

ఎంట్రీ ఇచ్చిన కంగనా..
టైమ్స్ నౌ చేసిన ట్వీట్‌కు కంగనా రియాక్ట్ అయింది. D అంటే దీపికా పదుకొణె K అంటే కరీష్మా అని ప్రచురించింది. కరిష్మ అంటే క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఉద్యోగి. అంటూ అందులోని వివరాలను తెలుపుతున్న వీడియోను కంగనా షేర్ చేస్తూ కామెంట్ చేసింది.

మాల్ హై క్యా..
డ్రగ్స్ భాగోతంపై కంగనా సెటైర్ వేస్తూ.. నా తరువాత దీన్ని మరు రిపీట్ చేయండి. డ్రగ్స్ వాడకం వల్ల వచ్చే పరిణామమే డిప్రెషన్.. సోసైటీలో పెద్ద వాళ్లమని, క్లాస్ పీపుల్స్ అని, గొప్ప సంప్రదాయబద్దంగా పెరిగామని చెప్పుకుని తిరిగే స్టార్ కిడ్స్ వాళ్ల మేనేజర్స్‌ను మాల్ హై క్యా అని అడుగుతారు. అని కంగనా ట్వీట్ చేసింది.
Recommended Video

విచారణకు..
టాలెంట్ మేనేజర్ జయ సాహా విచారణ తర్వాత ఈ వారం కొందరికి సమన్లు జారీ చేసే అవకాశం ఉందనే విషయాన్ని ఎన్సీబీ వెల్లడించినట్టు రిపబ్లిక్ టీవీ తెలిపింది. వచ్చే వారం శ్రద్దాకపూర్, సారా ఆలీ ఖాన్‌తోపాటు మరి కొందరు సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉందనే వార్తలు మీడియాలో వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











