కథ లాక్ చేశాం.. బాహుబలి కంటే పెద్ద సినిమా, నేనే డైరెక్టర్.. కంగనా రనౌత్ మరో సంచలనం!

ఇటీవల కంగనా రనౌత్ కొందరు బాలీవుడ్ ప్రముఖులపై వరుస విమర్శలతో రెచ్చిపోతోంది. వారసత్వం విషయంలో ఇటీవల అలియా భట్ ని కంగనా తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కంగనా తరచుగా వివాదాలు కొని తెచ్చుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. ఏది ఏమైనా కంగనా రనౌత్ అభూతమైన నటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కంగనా రనౌత్ చివరగా నటించిన చిత్రం మణికర్ణికా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. క్రిష్ తప్పుకున్న తర్వాత కంగనా రనౌత్ దర్శకురాలిగా మరి మణికర్ణిక చిత్రాన్ని ఫినిష్ చేసింది. తాజాగా కంగనా రనౌత్ చేసిన ఓ ప్రకటన సంచలనంగా మారింది.

ఎక్కువ భాగం నేనే

ఎక్కువ భాగం నేనే

మణికర్ణిక చిత్రం విషయంలో క్రిష్, కంగనా రనౌత్ మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ చిత్ర దర్శకత్వం విషయంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. మణికర్ణిక 70 శాతం షూటింగ్ తన దర్శకత్వంలోనే తెరకెక్కిందని, క్రిష్ డైరెక్ట్ చేసింది కేవలం 30 శాతమే అని కంగనా రనౌత్ చెప్పుకుంది. కంగనా వ్యాఖ్యలని క్రిష్ ఖండించారు. తాను మరో చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాను అంటూ కంగనా రనౌత్ ఊహించని ట్విస్ట్ఇచ్చింది .

 జయలలిత బయోపిక్

జయలలిత బయోపిక్

ప్రస్తుతం కంగనా రనౌత్ ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో నటించనుంది. దర్శకుడు ఏఎల్ విజయ్ జయలలిత బయోపిక్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం కోసం కంగనా రనౌత్ తమిళం నేర్చుకుంటోందట. హిందీలో ఈ చిత్రాన్ని జయ పేరుతో విడుదల చేయనున్నారు.

బాహుబలి కంటే పెద్దది

బాహుబలి కంటే పెద్దది

మణికర్ణిక చిత్రం తర్వాత కంగనా రనౌత్ మరో చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సిద్ధం అవుతోంది. ఆ చిత్రం గురించి కంగనా రనౌత్ చేసిన ప్రకటన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. జయలలిత బయోపిక్ తర్వాత తాను డైరెక్ట్ చేయబోయే చిత్రం బాహుబలి, పద్మావత్ చిత్రాల కంటే పెద్దదిగా ఉంటుందట. కథని లాక్ చేశాం. త్వరలో ఈ చిత్ర లుక్ కోసం ఫోటో షూట్ కూడా చేయబోతున్నట్లు కంగనా రనౌత్ ప్రకటించింది.

 చారిత్రాత్మక నేపథ్యంలో

చారిత్రాత్మక నేపథ్యంలో

తాను దర్శకత్వం వహించబోయే ఆ చిత్రం చారిత్రాత్మక నేపథ్యంలో ఉంటుందని కంగనా రనౌత్ తెలిపింది. ఈ చిత్రంలో కబడ్డీ క్రీడకు సంబంధించిన అంశాలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. కొంత కాలంగా కంగనా రనౌత్ కబడ్డీ క్రీడలో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. నటిగా, దర్శకురాలిగా బాహుబలి స్థాయి చిత్రాన్ని భుజానికెత్తుకోవడం పెద్ద సాహసమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X