సుశాంత్‌ను అలా దెబ్బకొట్టాడు.. కరణ్ జోహర్ నిజ స్వరూపం బయటపెట్టిన కంగన

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తింది. ఎందో మందిని వీధుల్లోకి ఈడుస్తోంది. బాలీవుడ్‌పై ఎప్పటి నుంచో మరక పడ్డ నెపోటిజం అనే మాట మళ్లీ చర్చల్లోకి వచ్చింది. బాలీవుడ్ బంధుప్రీతిని ఎప్పటి నుంచో వేలెత్తి చూపిస్తున్న కంగనా రనౌత్‌.. తాజాగా ఓ మీడియాతో మాట్లాడింది. సుశాంత్‌ను అందరూ కలిసి ఎలా చంపారో చెప్పుకొచ్చింది. అందులో కరణ్ జోహర్ పాత్ర గురించి సంచలన కామెంట్స్ చేసింది.

Recommended Video

Sushant Singh Rajput : సుశాంత్‌ ను ఎలా చంపారంటే.. కరణ్ జోహర్ పాత్ర హైలైట్ అంటున్న కంగనా!
ఆదిత్య చోప్రా..

ఆదిత్య చోప్రా..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డేట్స్‌ను ఆదిత్యా చోప్రా గుప్పిట్లో పెట్టుకున్నాడని కంగనా పేర్కొంది. ఎవరికీ ఆ డేట్స్‌ను ఇవ్వకుండా మరే చిత్రాలు చేయకుండా అడ్డుపడ్డాడని కంగనా ఆరోపించింది. ఐదేళ్ల పాటు ఒక్క సినిమా తీయకుండా ఉన్నాడని ఫైర్ అయింది.

ధోని లాంటి హిట్..

ధోని లాంటి హిట్..

ధోని లాంటి సూపర్ హిట్ చిత్రం వచ్చాక కూడా సుశాంత్ సింగ్ మరో సినిమాను ఎందుకు త్వరగా తీయలేకపోయాడని ప్రశ్నించింది. సంజయ్ లీలా భన్సాలీ గత ఐదేళ్లుగా అతడి కోసం ఎదురుచూశానని బహిరంగంగానే చెప్పాడు. రామ్ లీలా, భాజీరావు మస్తానీ కోసం సుశాంత్ కావాలని ఆదిత్యను అడిగితే రణ్‌వీర్ సింగ్ ఇచ్చాడని చెప్పుకొచ్చిన విషయాన్ని కంగనా గుర్తు చేసింది.

రంగంలోకి కరణ్..

రంగంలోకి కరణ్..

ఆదిత్య చోప్రా తరువాత కరణ్ జోహర్ రంగంలోకి దిగాడని, అతడిని ఓ ఫ్లాప్ స్టార్‌గా ముద్ర వేసేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డులను ఆయన డిసైడ్ చేస్తారని, తన సినిమాలకు సంబంధించి కూడా అతడే నిర్ణయిస్తాడని ప్రకటించింది.

ఆ సినిమాను విడుదల కానివ్వలేదు..

ఆ సినిమాను విడుదల కానివ్వలేదు..

సుశాంత్ సింగ్‌తో కరణ్ జోహర్ చేసిన డ్రైవ్ సినిమాను ఎందుకు విడుదల కానివ్వలేదని ప్రశ్నించింది. తాను ఓ చిన్న నిర్మాతను అయినప్పటికీ తన చిత్రాన్ని విడుదల చేసుకున్నానని, కానీ కరణ్ మాత్రం సుశాంత్‌తో సినిమా తీసి అది విడుదల కానివ్వకుండా ఆపేసుకున్నాడని తెలిపింది. అలా సుశాంత్‌ను కరణ్ ఓ ఫ్లాప్ హీరోగా ముద్ర వేశాడని కంగనా చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X