దేశమంటే పట్టదా? నీ విలాసాలు ప్రజల భిక్ష.. రణ్‌బీర్, అలియాపై కంగన ఫైర్
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ఏది మాట్లాడినా అది వివాదం వైపు దారి తీస్తున్నది. సినిమా విషయాలే కాకుండా, దేశానికి సంబంధించిన ప్రతీ విషయంపై కంగన క్షుణ్ణంగా స్పందిస్తున్నది. తాజాగా జాతీయభావానికి సంబంధించిన అంశాలపై బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించకపోవడంపై ఘాటుగా స్పందించారు. అలాగే రణ్‌బీర్ కపూర్, అలియాభట్ తీరును తప్పుపట్టారు. పుల్వామా, సర్జికల్ స్ట్రయిక్స్, అభినందన్ అంశాలపై మాట్లాడకపోవడంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే..

రాజకీయాలు మాకు అవసరం లేదని
దేశంలో తాజాగా చోటుచేసుకొన్న పరిస్థితుల గురించి రణ్‌బీర్ కపూర్, అలియాభట్ స్పందిస్తూ.. మేమెందుకు రాజకీయాల్లో తలదూర్చాలి, వాటి గురించి మేముందుకు మాట్లాడాలి. మనం దేశానికి ఏమీ చేయనప్పుడు వాటికి చర్చించాల్సిన అవసరం ఏముంది. నా ఇంట్లో కరెంట్, వాటర్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కొన్ని విషయాలపై మన ప్రమేయం లేనప్పుడు వాటికి ఎందుకు బాధ్యత వహించాలి అని అన్నారు.

నీకు ప్రజలు పెట్టిన భిక్ష అది
రణబీర్, అలియా చేసిన వ్యాఖ్యలపై కంగన తీవ్రంగా స్పందించారు. నీ ఇంట్లో అన్నీ ఉన్నాయంటే.. అవి దేశం మీకు ఇచ్చింది. నీవు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నావంటే, మెర్సిడెజ్ కారులో తిరుగుతున్నావంటే అది ప్రజలు పెట్టిన భిక్ష. దేశం లేకుంటే నీవు లేవన్నది గుర్తుంచుకోవాలి. ఈ దేశ పౌరుల డబ్బుతోనే నీ జీవితం ముడిపడి ఉంది. అలా మాట్లాడటం బాధ్యతారాహిత్యం అని కంగన మండిపడ్డారు.

కంగన వ్యాఖ్యలపై అలియాభట్
కంగన చేసిన వ్యాఖ్యలపై అలియాభట్‌ను మీడియా స్పందించమని కోరగా.. కంగన మాట్లాడినట్టుగా నేను అంత ఘాటుగా నేను మాట్లాడలేను. కంగన స్పందించే తీరుపై నాకు విపరీతమైన గౌరవం ఉంది. ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేమీ కనిపించలేదు. మాకు అలాంటి ఆలోచన తీరు మాలో కనిపించదు.

కంగనాకు అలియాభట్ కౌంటర్
దేశానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఫాలో కావాలని మా నాన్న మహేష్ భట్ ఎప్పడూ చేబుతుంటాడు. ప్రపంచంతో మన జీవితం ముడిపడి ఉంది. మనకంటూ ఓ అభిప్రాయం ఉండాలి. నా కంటూ ఓ అభిప్రాయం ఉంది. అది నాలోనే దాచుకొంటాను. కంగన మాదిరిగా నేను బయటకు చెప్పలేను అని అలియభట్ అన్నది.


Click it and Unblock the Notifications











