ఆ హీరోలపై కంగనా సంచలన వ్యాఖ్యలు.. వాళ్ళు నా సినిమా విషయంలో అంతే అంటూ..

బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఏం మాట్లాడినా కూడా మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. ఆమె గత కొంత కాలంగా తన మాటల డోస్ ను మరింత పెంచిందనే చెప్పాలి. గతంలో తనని ఇబ్బంది పెట్టిన దర్శక నిర్మాతలపై కూడా డైరెక్ట్ గా కౌంటర్స్ వేసింది. ఇక స్టార్ హీరోల విషయంలో అయితే ప్రతీ సారి ఆమె ఎదో ఒక కౌంటర్ ఇస్తూనే ఉంది. రీసెంట్ గా కొంత మంది అగ్ర హీరోల పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళందరూ తన సినిమా విషయంలో మరొక విధంగా ఆలోచిస్తారు అని ఆరోపణలు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

హీరోలపై విమర్శలు..

హీరోలపై విమర్శలు..

కంగనా రనౌత్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త పాయింట్ హైలెట్ అవుతుందని చెప్పవచ్చు. చాలా వరకు కంగనా తన ప్రతీ సినిమాను ఒక చాలెంజింగ్ గా తెరపైకి తీసుకు వస్తుంటుంది. ఇక ఆమె బాలీవుడ్ బడా హీరోలపై విమర్శలు చేస్తున్నప్పటి నుంచి కూడా ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ సినిమాలను చేస్తోంది. ఆ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ రేంజ్ లో క్లిక్కవుతున్నాయి.

సినిమా ప్రమోషన్ లో..

సినిమా ప్రమోషన్ లో..

ఇక ప్రస్తుతం ధాకడ్ సినిమాతో రెడీ అవుతున్న కంగనా రనౌత్ ఇటీవల ట్రైలర్ తోనే ఒక రేంజ్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఆ సినిమా మే 20వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె సినిమా కంటే ఎక్కువగా ఇతర విషయాలపై స్పందిస్తోంది. మొన్న మహేష్ బాలీవుడ్ ఇండస్ట్రీ పై చేసిన కామెంట్స్ కు ఆమె సపోర్ట్ చేస్తూ స్పందించిన విషయం తెలిసిందే.

నా సినిమా విషయంలో..

నా సినిమా విషయంలో..

ఇక రీసెంట్ గా మరోసారి కొంతమంది బాలీవుడ్ ప్రముఖ హీరోలపై కూడా కంగనా ఎవరు ఊహించని వ్యాఖ్యలు చేసింది. ఇతర బాలీవుడ్ సినిమాలను తాను చాలాసార్లు ప్రమోట్ చేశానని అయితే బాలీవుడ్ లోని పెద్ద హీరోలు మాత్రం నా సినిమాలను ప్రమోట్ చేయరని చెప్పింది. ముఖ్యంగా అజయ్ దేవ్ గన్ ఇతర సినిమాలను ప్రమోట్ చేస్తాడు గాని నా సినిమా విషయంలో మాత్రం అలా ఆలోచించడని తెలిపింది.

అక్షయ్ కుమార్ అలా..

అక్షయ్ కుమార్ అలా..

ఇక అక్షయ్ కుమార్ తన తలైవి సినిమా చూసి బాగుందని ఫోన్ లో మాత్రమే చెప్పాడు అని.. సినిమా గురించి మాత్రం ఎలాంటి ట్వీట్ చేయడని తెలిపింది. అదే విధంగా అమితాబ్ బచ్చన్ గారు సైతం నా సినిమా సాంగ్ టీజర్ ను పోస్ట్ చేసి డిలీట్ చేస్తారని చెప్పింది. ఇక ఆ విషయాల గురించి ఇంతకంటే ఎక్కువగా తాను ఏమి మాట్లాడలేను అని చెప్పిన కంగనా ఆ తరువాత కూడా మళ్ళీ మరిన్ని కామెంట్స్ చేసింది.

Recommended Video

Mahesh Babu Bollywood Controversy... Queen Backs Prince | Telugu Filmibeat
ఆ విధంగా సపోర్ట్ చేయరు..

ఆ విధంగా సపోర్ట్ చేయరు..

అజయ్ దేవగణ్‌ లాంటి హీరోలు ఇతరులు చేసిన లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించేందుకు ఒప్పుకుంటారు కాను నేను అలాంటి సినిమాలు చేస్తే మాత్రం ఆ విధంగా సపోర్ట్ చేయరు. ఎందుకంటే నా సినిమాల్లో అలా నటిస్తే నాకే ఎక్కువ పేరు వస్తుందని అనుకుంటారని చెప్పింది. ఇక ఈ తరుణంలో తనకు సపోర్ట్‌ చేసిన అర్జున్‌ రాంపాల్‌పై ఎలా కృతజ్ఞతతో ఉంటానో, అలాగే అజయ్‌ దేవగణ్‌ నా సినిమాల్లో నటించిన అలాగే గొప్పగా ఫీల్‌ అవుతానని కంగనా వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X