ఆ జంటపై ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. వాళ్ల పాప ఒక ప్రమోషన్ అంటూ!
బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ గురించి ఏమాత్రం పరిచయం లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటి కాంట్రవర్సీ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. ఎప్పుడూ ఓదో ఒక టాపిక్ పై వ్యాఖ్యలు చేస్తూ వివాదాలపాలవుతుంటుంది. గతంలో బాలీవుడ్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ లపై విమర్శలు చేసిన ఈ ముద్దుగుమ్మ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే తన మాజీ బాయ్ ఫ్రెండ్ హృతిక్ రోషన్ పై సంచలన కామెంట్స్ చేసింది.
మోసం చేసిన విషయం:హిందీ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులపై ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటుంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. సోషల్ మీడియా వేదిక స్టార్ సెలబ్రిటీలు అయిన కరణ్ జోహార్ వంటి వారిపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటుంది. తాజాగా తన మాజీ బాయ్ ఫ్రెండ్, గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తనను ఎలా మోసం చేశాడో ఇన్ స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది.

నీచమైన ప్రవర్తన:"ఫిల్మ్ మాఫియా ఎప్పుడూ నేరాలకు పాల్పడుతూనే ఉంటుంది. నేను డేటింగ్ చేసిన ఈ సూపర్ స్టార్ ఓ మోసగాడు. అతను నాతో చాట్ చేయడానికి వేర్వేరు నంబర్లు, అకౌంట్ నెంబర్స్ ఉపయోగించేవాడు. అంతేకాకుండా అతను నా అకౌంట్ హ్యాక్ చేసేవాడు. అయితే అప్పుడు నేను అతను విడాకులు తీసుకుంటున్నట్లుగా భావించాను. కానీ, తర్వాతే తెలిసింది అతను నీచమైన ప్రవర్తనతో ఒరిగింది ఏం లేదని, విడాకులకు హ్యాకింగ్ కు సంబంధం లేదని" అని కంగనా రనౌత్ ఇన్ స్టా లో పేర్కొంది.

భయంకరమైన నేరస్థులు:కంగనా రనౌత్ ఇంకా కొనసాగిస్తూ.. "వారు పెద్ద మొత్తంలో నకిలీ టికెట్లు కొంటారు. కలెక్షన్లను కూడా తప్పుగా చూపిస్తారు. అలాగే పర్సనల్ విషయాలపై గూఢచర్యం చేస్తారు. వాట్సాప్ డేటాను కొనుగులో చేసి మన వ్యక్తిగత విషయాలపై ఎల్లప్పుడూ నిఘా పెడతారు. వాళ్లు కేవలం టాలెంట్ లేని స్టుపిడ్స్ కాదు. నేర ప్రవృత్తి ఉన్న భయంకరమైన నేరస్థులు. దయచేసి ముంబై సైబర్ క్రైమ్ యాక్షన్ తీసుకోండి" అని రాసుకొచ్చింది.

అది నచ్చలేదు:ఇక ఇదే ఇన్ స్టా స్టోరీల్లో మరోసారి రణ్ బీర్ కపూర్ ను లాగింది బ్యూటిఫుల్ కంగనా రనౌత్. "ఇండస్ట్రీలో వుమనైజర్ గా పేరొందని మరో సూపర్ స్టార్ నా ఇంటికి వచ్చి అతనితో డేటింగ్ చేయమని ప్రాధేయపడ్డాడు. నన్ను ఎప్పుడు రహస్యంగానే కలిసేవాడు. అలా ఎందుకు అని నేను అడిగాను. అప్పుడు అతను పాప కి పరి నటితో ట్రయాలజీ డేటింగ్ లో ఉన్నట్లు చెప్పాడు. నాకు అది నచ్చలేదు" అని కంగనా చెప్పుకొచ్చింది.

ఆ పాప ప్రమోషన్:రణ్ బీర్ కపూర్ కూడా ఇతర నెంబర్ల నుంచి కాల్స్, మెసేజెస్ చేసేవాడు. నేను వాటన్నింటిని బ్లాక్ చేశాను. తర్వాత నా ఫోన్స్, పలు డివైస్ లన్నీ అతను హ్యాక్ చేయించినట్లు అనిపించింది. ఇక అతని పెళ్లి ఒక ఫేక్. అతనికి పుట్టిన పాప సినిమాను ప్రమోట్ చేసే సాధానం అని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. ఎవరైనా ఇంత అనైతికంగా ఉంటారా అని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అని కంగనా తెలిపింది.

నాశనం చేయడం:"వాళ్లు మనుషులు కాదు. రాక్షసులు. అందుకే నేను వారిని నాశనం చేయాలని నిశ్చయించుకున్నాను. ధర్మం ముఖ్య ఉద్దేశం అధర్మాన్ని నాశనం చేయడమే. అదే భవద్గీత లో శ్రీ కృష్ణుడు చెప్పినట్లుగా. నేను అదే చేస్తున్నాను" అని కంగనా వెల్లడించింది. కాగా కంగనా ప్రస్తుతం చంద్రముఖి 2, ఎమర్జెన్సీ చిత్రాలతో బిజీగా ఉంది. అక్టోబర్ 20న చంద్రముఖి 2, నవంబర్ 24న ఎమర్జెన్సీ రిలీజ్ కానున్నాయి.


Click it and Unblock the Notifications











