twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్యన్ ఖాన్‌కు హృతిక్ రోషన్ మద్దతు.. మరో కౌంటర్ ఇచ్చిన కంగనా రనౌత్

    |

    ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణలో షారుఖ్ కుమారుడికి పలువురు సినీ తారలు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ఏకంగా షారుఖ్ ఇంటికి వెళ్లి మరీ కలిశాడు. అతని కుటుంబ సభ్యులతో ప్రతి రోజు చాలా మాట్లాడుతున్న సల్మాన్ తన నుంచి కావాల్సిన పూర్తి మద్దతును సహాయాన్ని కూడా అందిస్తున్నట్లు టాక్ వస్తోంది. ఇక ఇప్పుడు నటుడు హృతిక్ రోషన్ కూడా సోషల్ మీడియా తనదైన శైలిలో మద్దతు అందించడం పై పలువురు పరోక్షంగా విమర్శలు కూడా చేస్తున్నారు. ఇక హృతిక్ పై గత కొన్నేళ్లుగా విమర్శలు చేస్తున్న కంగనా అతని పేరు ఎత్తకుండా కౌంటర్ గట్టిగానే ఇచ్చింది.

    మొదట ప్రశ్నించి..

    మొదట ప్రశ్నించి..

    అక్టోబర్ 3న గోవాలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బృందం ఒక క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ పార్టీలో హఠాత్తుగా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక అందులో షారుక్ తనయుడు ఆర్యన్ కూడా ఉండడంతో మొదట నార్మల్ గా ప్రశ్నించిన అధికారులు అనంతరం కేసు నమోదు చేశారు. అయితే అతను చేసింది తప్పా? పొరపాటా? అనే విషయంలో అనేక మంది అనేక రకాలుగా స్పందిస్తున్నారు.

    హృతిక్ రోషన్ సపోర్ట్

    హృతిక్ రోషన్ సపోర్ట్

    తన అనుభవాలను సొంతం చేసుకోవాలని మరియు తన తప్పులు వైఫల్యాల నుండి ఎంతగానో నేర్చుకోవాలని హృతిక్ ఆర్యన్‌కు సున్నితంగానే మద్దతు అందించాడు. ఇలాంటి సమయంలోనే ఎవరైనా సరే వారి లోపాలను బలాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది నీకు చాలా వేగంగా వచ్చింది. మనం సక్సెస్ తో పాటు ఫెయిల్యూర్స్ నుంచి వచ్చే చేదు అనుభవాలను కూడా జయించాలి అని అన్నాడు.

    లవ్ యూ మ్యాన్..

    లవ్ యూ మ్యాన్..

    అంతే కాకుండా.. దేవుడి దయ నీ పైన ఉంటుంది. ఇది కేవలం కొంత కాలం మాత్రమే ఉంటుంది. ఒక చీకటి క్షణాలు నుంచి వెలుగు లోకి రావడం లాంటిది.. అని హృతిక్ చాలా రకాలుగా వివరణ ఇచ్చారు. అంతే కాకుండా లవ్ యూ మ్యాన్ అంటూ మద్దతు ఇచ్చాడు. కేవలం హృతిక్ రోషన్ మాత్రమే కాకుండా కొంతమంది బాలీవుడ్ తారలు పర్సనల్ గా షారుఖ్ ఖాన్ కి మద్దతుగా నిలిచినట్లు ఒక టాక్ అయితే వస్తోంది.

    కంగనా కౌంటర్

    కంగనా కౌంటర్

    ఇక ఆ విషయంపై కంగనా చేసిన వ్యాఖ్యలు అయితే మరోసారి బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ లో కంగనా రనౌత్ ఇలా వ్రాసింది. ఇప్పుడు మాఫియా పప్పులు అందరు ఆర్యన్ ఖాన్ రక్షణ కోసం వస్తున్నారు. మేము తప్పులు చేస్తున్నాము కానీ మనం వాటిని కీర్తించకూడదు. అనే విదంగా సంబోధిస్తుంన్నారు అని తెలిపింది.

    అది ఒక నేరమే..

    అది ఒక నేరమే..

    వారు తప్పు చేయలేదని వారికి అనిపించడం అదొక నేరం.. అంటూ ఇలా మద్దతు ఇస్తే భవిష్యత్తులో అతనికి మరో పర్యవసానంగా మరే అవకాశం ఉంటుందని కూడా కౌంటర్ ఇచ్చారు. ఫైనల్ గా కంగనా ఆర్యన్ విషయంలో హృతిక్ రోషన్ మాట్లాడిన విధానం ఏ మాత్రం బాగా లేదని ఇన్ డైరెక్ట్ కామెంట్ చేసినట్లు అర్ధమవుతోంది. మరి కంగనా చేసిన కామెంట్స్ పై హృతిక్ రోషన్ సన్నిహితులు ఎలా స్పందిస్తారో చూడాలి.

    English summary
    Kangana Ranaut shocking comments on Hrithik Roshan support to Aryan khan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X