నీ కొడుకు అభిషేక్ బచ్చన్ కూడా సుశాంత్‌లా ఏమైనా చేసుకుంటే ఇలానే అంటావా?

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక వివాదం తెరపైకి వస్తే అది ఎటు నుంచి ఎటు వైపు వెళుతుందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఒక దగ్గర మొదలైన కామెంట్ మరెక్కడో కొత్త వివాదానికి దారి తీస్తోంది. డ్రగ్స్ వివాదం ఫైనల్ గా పార్లమెంట్ లో కొత్త వివాదాలకు దారితీసింది. జయా బచ్చన్ స్పంధించి విధానంపై మరోవైపు కంగనా బచ్చన్ ఫ్యామిలీపై ఎవరు ఊహించని విధంగా స్పందించింది.

Recommended Video

Jaya Bachchan కు కౌంటర్ ఇచ్చిన Kangana Ranaut,నా స్థానంలో మీ కూతురు ఉంటే ఇలాగే మాట్లాడతారా ?
రేసుగుర్రం విలన్ షాకింగ్ కామెంట్స్

రేసుగుర్రం విలన్ షాకింగ్ కామెంట్స్

ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భోజ్ పూరి నటుడు, పార్లమెంట్ సభ్యుడు రవి కిషన్ బాలీవుడ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకాన్ని విస్తరింప జేస్తోందని వివిధ దేశాల నుంచి వచ్చే మాదక ద్రవ్యాలు సరాసరి బాలీవుడ్ లోకి వెళుతున్నాయని రవి కిషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందరిని విమర్శించడం కరెక్ట్ కాదు

అందరిని విమర్శించడం కరెక్ట్ కాదు

ఇక రవి కిషన్ చేసిన కామెంట్స్ పై పార్లమెంట్ సభ్యురాలిగా జయా బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమను కావాలని తప్పు బడుతున్నారని ఎవరో ఒకరు చేసిన తప్పుకు అందరిని విమర్శించడం కరెక్ట్ కాదని అన్నారు. కొందరు అనవసరంగా పని గట్టుగొని బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెడ్డపేరు తేవాలని చూస్తున్నట్లు జయా బచ్చన్ కామెంట చేయడంతో అందుకు కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది.

నా స్థానంలో నీ కూతురు ఉంటే: కంగనా

"జయా జి నా స్థానంలో మీ కుమార్తె ఉంటే ఆమెను ఎవరైనా కొడితే మీరు ఉరుకుంటారా అలాగే మాదకద్రవ్యాలతో టీనేజ్ వయస్సులో వేధింపులకు గురిచేస్తే మీరు ఇదే చెబుతారా, అభిషేక్ నిరంతరం బెదిరింపులకు వేధింపుల గురించి ఫిర్యాదు చేసి, ఒక రోజు ఉరి వేసుకుని ఉంటే మీరు అదే చెబుతారా?' అంటూ ఘాటుగా స్పందించిన కంగనా అందరిని సమానంగా చూడాలని పేర్కొంది.

తెలివిగా అడుగులు వేస్తోన్న కంగనా

తెలివిగా అడుగులు వేస్తోన్న కంగనా

కంగనా చేసిన ఈ కామెంట్ బాలీవుడ్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వడంలో కంగనా చాలా తెలివిగా అడుగులు వేస్తోంది. ఇక ఇటీవల కంగనా ముంబై నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని తన స్వస్థలానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఆమె రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X