twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియా తప్పు చేయకపోతే అంత పెద్ద లాయర్ ఎందుకంటా.. ప్రశ్నలతో షాక్ ఇచ్చిన కంగనా

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత కంగనా రనౌత్ తన ఆలోచనలకు మరింత పదును పెట్టింది. అంధరికంటే ఎక్కువగా ఆమె సుశాంత్ కేసు విషయంపై ఒంటరి పోరాటం చేస్తున్నట్లుగా ప్రశంసలు దక్కుతున్నాయి. కోర్టు నిర్ణయంతో సుశాంత్ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లింది. అయితే రియా చక్రవర్తి ముందు జాగ్రత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం పట్ల కంగనా తీవ్ర స్థాయిలో కొన్ని ప్రశ్నలతో కొత్త అనుమానాలను కలిగిస్తోంది.

    Recommended Video

    #CBIForSSR : Kangana Ranaut, Sonu Sood రియాక్షన్ , న్యాయం జరగాలని డిమాండ్ | Onrindia Telugu
    అనుమానాలు ఇంకా బలపడుతున్నాయ్..

    అనుమానాలు ఇంకా బలపడుతున్నాయ్..


    ఇటీవల నేషనల్ మీడియాతో మాట్లాడిన కంగనా రియా చక్రవర్తి తీరుపై అనుమానాలు ఇంకా బలమవుతున్నట్లు తెలిపింది. సాధారణంగా ఒక కేసును వాదించడానికి మంచి లాయర్ నియామకం అవ్వడానికి వారం సమయమైనా పడుతుంది. కానీ రియా ముందు జాగ్రత్తగా ఖరీదైన క్రిమినల్ లాయర్ ని ఎలా పొందగలిగిందని కంగనా ప్రశ్నించింది.

    రియా తప్పు చేయకపోతే ఆ లాయర్ ఎందుకు?

    రియా తప్పు చేయకపోతే ఆ లాయర్ ఎందుకు?


    గతంలో సుశాంత్ మృతి కేసు వెనుక బడా నేతలు సినీ తారలు ఉండవచ్చని కంగనా అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే రియా చక్రవర్తి వెనుక కూడా చాలా మందే ఉన్నారని ఆమెకు కేసు విషయంలో సలహాలు ఇస్తూ సపోర్ట్ చేస్తున్నారని తెలిపింది. అసలు రియా చక్రవర్తి తప్పు చేయకపోతే ఆమెకు సతీష్ లాంటి బడా లాయర్ ఎందుకు అని కంగనా చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

     లాయర్ ఫీజు ఎలా చెల్లిస్తోంది..

    లాయర్ ఫీజు ఎలా చెల్లిస్తోంది..


    గతంలో తాను కూడా ఎన్నో కేసులను ఎదుర్కొనాని చెబుతూ.. రియా తరహాలో అయితే న్యాయవాది నియామకం పొందలేదని కంగనా తెలిపింది. ఇక రియా తన దగ్గర డబ్బు లేవని చెబుతున్నప్పుడు న్యాయవాదికి అంత మొత్తంలో ఫీజు ఎక్కడి నుంచి ఇస్తోందని ఏ తప్పు చేయకపోతే ఇంతలా ఖర్చు చేయాల్సి అవసరం లేదని కూడా వివరణ ఇవ్వడం సరికొత్త అనుమానాలకు దారి తీస్తోంది.

     అసలుగుట్ట భయటపడుతోంది..

    అసలుగుట్ట భయటపడుతోంది..

    ఈ కేసు విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని సీబీఐ విచారణలో అసలు గుట్టు బయటపడుతుందనే నమ్మకం తనకు ఉందని కూడా కంగనా తెలియజేసింది. ఇక సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే కంగనా సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తూ తన వివరణ ఇచ్చింది. అమేజింగ్.. మానవత్వం గెలుస్తోంది, సుశాంత్ అభిమానుల పోరాటానికి ఫలితం దొరికినట్లు ట్వీట్ చేసింది.

    English summary
    Supreme Court dismisses Rhea Chakraborty petition on Sushant Singh Rajput case from patna to Mumbai. Nation's highgest court Supreme Court's verdict in Rhea Chakraborty's petition in Sushant Singh Rajput death case regarding transfer from Patna to Mumbai. After The SC had on August 11 reserved its order in the case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X