twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంగనను మహేష్‌భట్ చెప్పుతో కొట్టాడు.. ఆ హీరో వేధించాడు.. అలియాఫై రంగోలి ఫైర్

    |

    బాలీవుడ్ తారలు కంగన రనౌత్, అలియా భట్ మధ్య వివాదానికి ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా ఈ వివాదంలోకి కంగన సోదరి రంగోలి రంగంలోకి దిగింది. వరుస ట్వీట్లతో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకొన్నారు. కేవలం అలియాభట్ పైనే కాకుండా తండ్రి మహేష్ భట్ తండ్రిపై దారుణమైన ఆరోపణలు చేసింది. మహేష్ భట్‌ను టార్గెట్ చేసుకొని రంగోలి వ్యంగ్యాంస్త్రాలను సంధించింది. వివరాల్లోకి వెళితే..

    కంగన ఎటాక్‌పై అలియా తల్లి స్పందన

    కంగన ఎటాక్‌పై అలియా తల్లి స్పందన

    మహేష్ భట్‌ కుటుంబంపై చేస్తున్న ఆరోపణలపై అలియాభట్ తల్లి సోని రజ్దాన్ స్పందించింది. కంగన రనౌత్‌కు సినీ పరిశ్రమలో మహేష్‌భట్ బ్రేక్ ఇచ్చారు. అలాంటి వ్యక్తి భార్య, కూతురుపై ఎటాక్ చేస్తారా? నా కూతురిపై పలుమార్లు దారుణమైన కామెంట్ చేస్తున్నది. అంతగా ద్వేషించడం వెనుక పరమార్థం ఏమిటో అర్ధం కావడం లేదు. ఆమె విమర్శల వెనుక ఎజెండా ఏమిటో అర్థం కావడం లేదు అని సోని రజ్దాన్ ట్వీట్ చేసింది.

     మహేష్ భట్‌పై నిప్పులు చెరిగిన రంగోలి

    మహేష్ భట్‌పై నిప్పులు చెరిగిన రంగోలి

    సోని రజ్దాన్ చేసిన ట్వీట్‌పై కంగన సోదరి రంగోలి ఛండేల్ తీవ్రంగా స్పందించారు. నా అక్క కంగనకు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ లమ్హే చిత్రం ప్రివ్యూ సందర్భంగా ఆమెను చెప్పుతో కొట్టాడు. కంగనకు మహేష్ బ్రేక్ ఇవ్వలేదు. మా అక్కయ్యకు బ్రేక్ ఇచ్చింది అనురాగ్ బసు మాత్రమే. మా అక్కకు అలియాభట్‌ను చూసి ఈర్ష్య పడాల్సిన అవసరం లేదు. కంగనకు కావాల్సినంత పేరు, ఖ్యాతి ఉంది అని రంగోలి ట్వీట్ చేసింది.

     అలియా భట్‌పై సెటైటర్లు

    అలియా భట్‌పై సెటైటర్లు

    అలియా గొప్ప సూపర్ మోడల్, జాతీయ అవార్డులు గెలుచుకొని ఉత్తమ నటిగా మారింది. ఆమె యాక్టింగ్ స్క్రిల్స్ మరొకరికి లేవు. ఇక అలియా తెలివి తేటల గురించి మాటల్లో చెప్పనక్కర్లేదు. అలియా నటన, రచనా ప్రతిభ, డైరెక్టర్‌గా టాలెంట్ అందరికీ తెలిసిందే అని అలియాపై రంగోలి సెటైర్లు విసిరింది.

    కంగన రనౌత్‌ను రణ్‌దీప్ హుడా వేధించాడు

    కంగన రనౌత్‌ను రణ్‌దీప్ హుడా వేధించాడు

    అంతేకాకుండా కంగన, అలియా మధ్య జరుగుతున్న వివాదంలో తలదూర్చిన నటుడు రణ్‌దీప్ హుడాపై రంగోలి మండిపడింది. అలియా గొప్ప నటి, ఆమె ప్రతిభవంతురాలు అని రణ్‌దీప్ చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. ఉంగ్లీ సినిమా షూటింగ్‌ సమయంలో కంగనను రణ్‌దీప్ హుడా వేధించాడు అని రంగోలి ఆరోపణలు చేసింది.

    English summary
    Kangana Ranaut's sister Rangoli Chandel isn't done with Alia Bhatt yet. In a series of tweets, she not only launched a fresh attack on Alia, but also made some shocking allegations against her father Mahesh Bhatt. She went on a Twitter rant against Mahesh Bhatt and even accused him of throwing a 'chappal' at a 19-year-old Kangana at the preview of her film Woh Lamhe.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X