twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంగనాను చచ్చేలా కొట్టారు.. యాసిడ్ దాడి.. 54 సర్జరీలు..

    By Kalyan
    |

    బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఎవరంటే టక్కున చెప్పే పేరు కంగనా రనౌత్ అనే. అయితే ఆమె మీద ఈగ వాలిన ఒప్పుకోదు ఆమె సోదరి రంగోలి చందేల్. పొరపాటున కంగనాను ఏమైనా అన్నారో.. అవతలి వారికి మూడినట్టే. మాటల యుద్దం చేయడంలో రంగోలీని మించినవారు లేరు. మణికర్ణిక విషయంలో కంగనాను ఎలా వెనకేసుకొచ్చిందో అందరం చూశాం.

    కంగనాకు వెన్నంటే ఉంటూ..

    కంగనాకు వెన్నంటే ఉంటూ..

    బాలీవుడ్ లాంటి పెద్ద ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్ గా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కంగనా.. టాప్ ప్లేస్ లో దూసుకుపోయింది. కంగనాకు నెపోటిజం అంటే నచ్చదు. వారసులుగా వచ్చిన వారిని ఏకిపారేస్తుంది. ఇక కంగనా వెంటే ఉంటూ.. తన మీదకు ఎవరైనా వస్తే.. వారి పని చెబుతూ ఉంటుంది. తాప్సీ, శ్రద్దా కపూర్, అలియా భట్ లాంటి స్టార్స్ ను సైతం విమర్శించింది.

    తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్న రంగోలి..

    తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్న రంగోలి..

    చిన్న తనంలో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలకు వచ్చిన స్పందన చూసి.. ఆశ్చర్యపోయింది. అయితే కాలేజ్లో దిగిన ఫోటోలను పెట్టమని తన స్నేహితులు కోరుతున్నారని, కాలేజ్ వార్షికోత్సవ వేడుకల్లో దిగిన ఫోటోను షేర్ చేసింది. అయితే ఈ ఫోటోతో పాటు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చింది.

    యాసిడ్ దాడి.. 54 సర్జరీలు..

    యాసిడ్ దాడి.. 54 సర్జరీలు..

    ఈ ఫోటో దిగిన కొద్ది సమయానికే.. నేను అంతకుముందు తిరస్కరించిన వ్యక్తి నాపై యాసిడ్ పోశాడు. నా చెల్లి కంగాను తీవ్రంగా హింసించారు. చచ్చేలా కొట్టారు. నాకు 54 సర్జరీలు జరిగాయి. ఇదంతా ఎందుకు జరిగింది. నా తల్లిదండ్రులు అందమైన, తెలివైన, ధైర్యవంతులైన అమ్మాయిలకు జన్మనివ్వడం వల్ల జరిగింది. ఈ ప్రపంచం అమ్మాయిల పట్ల దయ చూపదు. అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగా పోరాడే సమయమిది. అదే మన పిల్లలకు రక్షణ.

    Recommended Video

    Kangana Ranauat Spotted At Kamal Jain Office
    ఇంత ధైర్యంగా ఎలా ఉండగలిగారంటూ ప్రశంసలు..

    ఇంత ధైర్యంగా ఎలా ఉండగలిగారంటూ ప్రశంసలు..

    తన భర్త ఓ స్నేహితుడిలా ఉండి నిరంతరం అందించిన ప్రోత్సాహం, సోదరి కంగనా మద్దతు, తల్లిదండ్రులు అందించిన ధైర్యంతో తాను యాసిడ్‌ దాడి తాలూకు గాయాలను మరిచిపోయి.. సాధారణ జీవితాన్ని గడుపుతున్నానని తెలిపింది. యాసిడ్‌ దాడి తర్వాత ఎన్ని సర్జరీలు చేయించుకున్నా ఇప్పటికీ డాక్టర్లు తన చెవిని సరిచేయలేకపోయారని ఆమె పేర్కొన్నారు.

    English summary
    Kangana Sister Rangoli Chandel ABout Her Pathetic Situation In College Time. She Was Attacked By Acid. And She Went 54 Surgery. Now She Opens Up About That Situatuin
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X