కంగన రౌనత్‌ను చెప్పుతో కొట్టారు.. చంపుతామని బెదిరించారు..
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ సోదరి రంగోలి చండేల్ మరోసారి సినీ ప్రముఖులపై భగ్గుమన్నది. ఈ సారి జావెద్ అఖ్తర్, మహేష్ భట్ లాంటి సెలబ్రిటీలు ఆమె ఆగ్రహానికి గురయ్యారు. గతంలో తన సోదరి కంగన రనౌత్‌కు జరిగిన అన్యాయాన్ని బయటపెడుతూ సంచలన కామెంట్లు చేశారు. ఇంతకు రంగోలి వారిని ట్వీట్లతో ఎలా టార్గెట్ చేసిందంటే..

ప్రధాని మోడీని
ప్రధాని నరేంద్రమోదీని ఫాసిస్ట్ అంటూ కామెంట్లు చేయడంపై రంగోలి చండేలి మండిపడ్డారు. ప్రధాని ఫాసిస్ట్ అయితే మీరు ప్రవర్తన కూడా అలాంటిదే అని ఘాటుగా స్పందించారు. కంగనను కూడా టార్గెట్ చేయడంపై ఆగ్రహం చెందారు. తన సోదరిని ఎలా నిందించారనే విషయాన్ని ట్వీట్‌లో పేర్కొన్నారు.

హృతిక్‌కు సమాధానం చెప్పమని
నా సోదరి కంగన రనౌత్‌ను ఓ రోజు జావెద్ అఖ్తర్ తన ఇంటికి పిలిపించారు. హృతిక్‌తో గొడవ పెట్టుకొన్నందుకు ఆమెను క్షమాపణ కోరారు. క్షమాపణ చెప్పకపోతే అంతు చూస్తామని బెదిరించడమే కాకుండా భయపెట్టారు. ఆయన నా సోదరితో చాలా దారుణంగా వ్యవహరించారని ట్వీట్‌లో పేర్కొన్నారు.

నా సోదరిపైకి చెప్పు విసిరారు..
ఇక ఓ రోజు నా సోదరి సూసైడ్ బాంబర్ పాత్రను పోషించడం ఇష్టం లేదని తిరస్కరించడంపై మహేష్ భట్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఓ దశలో నా సోదరిపైకి చెప్పును విసిరారు. జావెద్ అఖ్తర్, మహేష్ భట్ ప్రధానిని ఫాసిస్ట్ అంటూ విమర్శించారు. చాచా (బాబాయ్) మీరిద్దరు ఏంటండి అంటూ రంగోలి చండేల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

జావెద్ అఖ్తర్‌ను టార్గెట్ చేయడం
జావెద్ అఖ్తర్ దంపతులనును టార్గెట్ చేయడం ఇది మొదటిసారి కాదు. గతేడాది పుల్వామా దాడి జరిగిన తర్వాత జావెద్ అఖ్తర్ సతీమణి షబానా ఆజ్మీ పాకిస్థాన్‌లో పర్యటించడంపై రంగోలి చండేల్ భగ్గుమన్న సంగతి తెలిసిందే. దాడిలో మృతి చెందిన సైనికులకు నివాళులర్పించకుండా పాక్‌కు వెళ్లడంపై మండిపడ్డటం వివాదంగా అప్పట్లో మారింది.


Click it and Unblock the Notifications











