Gehraiyaan మీద కంగనా రివ్యూ : అశ్లీల సినిమా, చెత్త సినిమా అంటూ!
దీపికా పదుకోన్, సిద్ధాంత్ చతుర్వేది మరియు అనన్య పాండే నటించిన గెహ్రాయియాన్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద మిశ్రమ స్పందన వస్తుండగా కంగనా రనౌత్ మాత్రం సినిమా మీద అతన అక్కసు వెళ్ళ గక్కింది. ఆ వివరాలలోకి వెళితే

అశ్లీల సినిమాతో పోల్చి
దీపికా పదుకోన్, సిద్ధాంత్ చతుర్వేది మరియు అనన్య పాండే నటించిన గెహ్రాయియాన్ సినిమా 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో భారీ అంచనాలతో విడుదలైంది. అయితే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ కాంప్లెక్స్ లవ్ డ్రామాని కొందరు కొనియాడుతున్నారు. అదే సమయంలో, మరికొందరు సినిమాలో ఉన్న అనైతిక సంబంధాలపై విమర్శలు చేస్తున్నారు. అయితే, కంగనా రనౌత్ గెహ్రాయియాన్ సినిమా మీద విరుచుకుపడింది అలాగే సినిమాను అశ్లీల సినిమాతో పోల్చింది.

మోడరన్ లైఫ్ స్టోరీ
సినిమా కథ ప్రకారం యోగా టీచర్‌గా పనిచేసే దీపిక పదుకోన్ తన ప్రియుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి ధైరా కర్వాతో సహజీవనం చేస్తుంటుంది. వారి మధ్య తరచూ అభిప్రాయబేధాలు తలెత్తుతుంటాయి. ప్రియుడితో లైఫ్ అసంతృప్తితో కొనసాగుతున్న సమయంలో తన కజిన్ అనన్య పాండే కాబోయే భర్త సిద్దాంత్ చతుర్వేదిని కలుస్తుంది. తొలి కలయికలో వారిద్దరూ ఒకరికొకరు ఆకర్షితులవుతారు.

వరుస పోస్టులు
ఇద్దరూ తమ తమ భాగస్వాములకు తెలియకుండా అనైతిక సంబంధంలోకి దిగుతారు. రొమాంటిక్ లైఫ్‌ను లీడ్ చేస్తుంటారు. ఆ సంబంధాలు ఎలాంటి పరిస్థితులకు దరి తీశాయి అనేది సినిమా కథ. అయితే ఈ సినిమా కథ చెత్తగా ఉందంటూ కంగనా కామెంట్స్ చేసింది. ఆమె తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి నటి తన ఇన్‌స్టాగ్రామ్ లో వరుస పోస్టులు చేసింది.

చెడ్డ సినిమాలుగానే
మనోజ్ కుమార్ యొక్క 'హిమాలయా కి ల్యాప్ మే'లోని 'చాంద్ సి మెహబూబా' పాటతో ఆమె తన ఆలోచనలను పోస్ట్ చేసి, '''నేను కూడా ఈ తరానికి చెందిన వ్యక్తినే, కానీ ఇలాంటి రొమాన్స్‌ని అర్థం చేసుకోగలను. దయచేసి కొత్త తరం యువత, అర్భన్ సినిమాల పేరుతో ఇలాంటి చెత్తను అమ్మకానికి పెట్టకండి. చెడ్డ సినిమాలు ఎప్పటికీ చెడ్డ సినిమాలుగానే ఉంటాయి, స్కిన్ షో, అశ్లీలత వంటివి చెత్త సినిమాలను ఏమాత్రం కాపాడలేవు' అంటూ విమర్శలు గుప్పించింది. అయితే మరి ఈ విషయం మీద ఇప్పటిదాకా దీపికా అండ్ టీమ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

వాళ్ళ కోసమే ఇక్కడ అంటూ
ఈ నెల ప్రారంభంలో, కంగనా తన కొత్త రియాలిటీ షో 'లాక్ అప్'ని ఒక ఈవెంట్‌లో ప్రారంభించింది. తరువాత మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. గెహ్రాయియాన్ ప్రమోషన్ సమయంలో దీపికను ఆమె 'హెమ్‌లైన్‌లు మరియు నెక్‌లైన్‌ల' విషయంలో అవమానించిన ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ గురించి విలేఖరి ఆమెను అడిగినప్పుడు ఆమె సీరియస్ అయింది. ఆ ప్రశ్నను తిరస్కరించిన కంగనా, "చూడండి, తమను తాము రక్షించుకోలేని వారిని రక్షించడానికి నేను ఇక్కడ ఉన్నాను. సరేనా? ఆమె తనను తాను రక్షించుకోగలదు. ఆమెకు ప్రత్యేక హక్కు ఉంది, వేదిక ఉంది" అని పేర్కొంది.


Click it and Unblock the Notifications











