Don't Miss!
- News డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్‌పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
హృతిక్‌పై మళ్ళీ రెచ్చిపోయిన కంగనా.. అబద్దం నమ్మేలా ఉందా!
కంగనా రనౌత్, హృతిక్ రోషన్ వివాదం నెవర్ ఎండింగ్ స్టోరీలా సాగుతూనే ఉంది. హృతిక్ తో ఎఫైర్ కు ప్రయత్నించిన కంగనా భంగపడిన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ హృతిక్ రోషన్ పై మరోమారు రెచ్చిపోయింది. ఈమెయిల్స్, లవ్ లెటర్స్ విషయంలో వీరి మధ్య పెద్ద రచ్చే జరిగింది. తాజాగా కంగనా రనౌత్ ఇండియా టుడే కాంక్లేవ్ 2019లో పాల్గొంది. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
రెండు చిత్రాల్లో నటించాం
మేమిద్దరం కలసి రెండు చిత్రాల్లో నటించాం. అయినా కూడా నేనెవరో వ్యక్తి గతంగా తెలియదని అంటున్నాడు. హృతిక్ రోషన్ చెబుతున్న ఈ అబద్దం నమ్మేలా ఉందా అని కంగనా ప్రశ్నించింది. అనురాగ్ బసు కైట్స్ చిత్రంలో, రాకేష్ రోషన్ తెరకెక్కించిన క్రిష్ 3 చిత్రంలో తామిద్దరం కలసి నటించినట్లు కంగనా రనౌత్ తెలిపింది. అయినా కూడా నేనెవరో తెలియదు అంటూ పారిపోతున్నాడు అని కంగనా మండిపడింది.
ప్రేమ లేఖల వివాదం
కంగనా రనౌత్, హృతిక్ రోషన్ మధ్య సాగిన ప్రేమ లేఖల వివాదం ఇప్పటికి బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈ వివాదం అటు హృతిక్ రోషన్ ని, ఇటుకంగనా రనౌత్ ని ఓ కుదుపుకు గురిచేసింది. ఇద్దరూ రచ్చకెక్కి ఒకరిపై ఒకరు తీవ్రమైనా విమర్శలు చేసుకున్నారు. తరచుగా కంగనా రనౌత్ ఈ వివాదం గురించి ఎదో విధంగా కామెంట్స్ చేస్తూనే ఉంటుంది.
ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా
హృతిక్ రోషన్ లాంటి వ్యక్తి తనని ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన తట్టుకుని నిలబడగల సత్తా తనకు ఉందని కంగనా రనౌత్ తెలిపింది. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయంలో కూడా తాను విజయం సాధించగలనని కంగనా తెలిపింది. హృతిక్ రోషన్ తో జరిగిన వివాదం గురించి ప్రస్తావిస్తూ.. తన జీవితంలో జరిగిన అత్యంత చేదు సంఘటన తర్వాత కూడా నటిగా తానేంటో నిరూపించుకుని ఈ స్థాయికి చేరుకున్నట్లు కంగనా తెలిపింది.
మణికర్ణిక చిత్రంతో
ఇటీవల కంగనా నటించిన చారిత్రాత్మక చిత్రం మణికర్ణిక మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కంగనా రనౌత్ వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి పాత్రలో నటించి మెప్పించింది. ఈ చిత్రం విషయంలో కూడా దర్శకుడు క్రిష్ తో కంగనాకు విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. మణికర్ణిక చిత్రం నుంచి క్రిష్ మధ్యలోనే తప్పుకున్నాడు.