విజయం అందించు మాతా : ‘మణికర్ణిక’ రిలీజ్ నేపథ్యంలో కంగనా ప్రత్యేక పూజలు!
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ 2019 సంవత్సరాన్ని భారీ విజయంతో మొదలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆమె నటించిన 'మణికర్ణిక-ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' చిత్రం వచ్చే వారం(జనవరి 25) విడుదలవుతున్న నేపథ్యంలో తమ కుల దైవం మాతా మహిషాసురమర్దిని ఆశీర్వాదం తీసుకుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వమించారు. ఈ టెంపుల్ కంగనా స్వస్థలం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా దాబోయిలో ఉంది.
ఈ గుడిలో కంగనా ప్రార్థనలు చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో ఆమె టీమ్ షేర్ చేసింది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ గుడి కట్టించింది కూడా ఆమెనట. కంగనా రనౌత్ హిందుత్వాన్ని విశ్వసించే వ్యక్తి. తాను హిందువుగా చెప్పుకోవడానికి గర్వపడతానని ఆమె గతంలో వెల్లడించారు.

ఝాన్సీరాణి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం 'మణికర్ణిక'. కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించిన ఈచిత్రానికి క్రిష్ జాగర్లమూడి, కంగనా దర్శకత్వం వహించారు. జనవరి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
మణికర్ణికగా జన్మించి ఆమె లక్ష్మిభాయిగా ఎలా మారింది. ఎలాంటి పరిస్థితుల్లో ఝాన్సీ రాణిగా బాధ్యతలు చేపట్టింది. తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి చేసిన సాహసాలు, తీసుకున్న నిర్ణయాలు ఇలా ప్రతి అంశం సినిమాలో చూపించబోతున్నారు.
ఈ చిత్రం క్రిష్ దర్శకత్వంలో మొలైలైంది. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయిన అనంతరం పలు కారణాలతో ఆయన తప్పుకోవడంతో.... మిగతా భాగాన్ని కంగనా రనౌత్ తన దర్శకత్వంలో పూర్తి చేశారు. నిర్మాత కమల్ జైన్ జీ స్టూడియోస్‌తో కలిసి దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











