ప్రధాని ఆహ్వానంతో.. కట్టుబొట్టుతో అందంగా మెరిసిన కంగన రనౌత్
ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన సినీ తారల్లో బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ ఒకరు. గురువారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమ వేడుకలో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది.
భారతీయ సంప్రదాయాన్ని, వెస్ట్రన్ కల్చర్‌ను ప్రతిబింబించే చీరకట్టులో కంగన మెరిసారు. తన వస్త్రధారణకు సంబంధించిన ఫొటోలను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

తెల్లటి చీరపై బంగారు పూతతో ఉన్న చీరను ధరించారు. స్లీవ్ లెస్, బ్రాడ్ స్ట్రాప్ జాకెట్‌ను ధరించి సుందరంగా ముస్తాబయ్యారు. అందమైన చీరకట్టులో అతిథులను ఆకర్షించారు. ప్రత్యేకమైన హెయిర్ స్టయిల్‌తో అందంగా కనిపించారు.
ప్రధాని మోదీ ప్రమాణస్వీకార మహోత్సవానికి కంగన రనౌత్‌తోపాటు అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్, వివేక్ ఒబెరాయ్, సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు కరణ్ జోహర్, షాహీద్ కపూర్ దంపతులు తదితరులు హాజరయ్యారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆహ్వానం అందినా.. వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేదు.

ఇక కంగన రనౌత్ విషయానికి వస్తే.. ఇటీవల ఆమె నటించిన మణికర్ణిక చిత్రం భారీ విజయం సాధించింది. ప్రస్తుతం ఆమె పంగా అనే కబడ్డీ క్రీడ నేపథ్యంగా తెరకెక్కే చిత్రంలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











