twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్‌లో దేశద్రోహులు.. గాడిదలపై వీధుల్లో ఊరేగించాలి.. షబానా ఆజ్మీపై కంగన ఫైర్

    |

    భారత సైనికులను టార్గెట్ చేసుకొని జమ్ము, కశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతిదాడి ఘటన దేశ ప్రజలను విషాదంలోకి నెట్టింది. అమర సైనికుల కుటుంబాలకు దేశవ్యాప్తంగా సంతాప ప్రకటనలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా సైనికుల కుటుంబాలకు సంఘీభావం వ్యక్తమవుతున్నది. ఇలాంటి భావోద్వేగ పరిస్థితుల నేపథ్యంలో బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. సినీ పరిశ్రమ జాతీ వ్యతిరేకులతో నిండిపోయింది అంటూ నటి షాబానా ఆజ్మీపై నిప్పులు చెరగడం మీడియాలో హైలెట్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

    పుల్వామా దాడి తర్వాత

    పుల్వామా దాడి తర్వాత

    పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో బాలీవుడ్ నటి షబానా ఆజ్మీపై కంగన రనౌత్ నిప్పులు చెరిగారు. పాకిస్థాన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలను నిలిపివేయాలని షబానా ఆజ్మీ పిలుపు నివ్వడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కరాచీలో తన తండ్రి కైఫీ అజ్మీ పేరిట నిర్వహించే సదస్సును రద్దు చేసుకొన్న సంగతి తెలిసిందే. షబానా లాంటి వాళ్లు భారత్‌ను ముక్కలు చేస్తామన్న మూకలకు సపోర్ట్ చేశారు అని కంగన మండిపడ్డారు.

    యూరీ దాడి ఘటన అనంతరం

    యూరీ దాడి ఘటన అనంతరం

    యూరీ దాడి ఘటన తర్వాత పాకిస్థానీ నటులను నిషేధిస్తే షబానా ఆజ్మీ కరాచీలో ఈవెంట్లు నిర్వహించారు. ఇప్పుడు వాళ్లే తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్‌లో జాతీ వ్యతిరేకులు చాలా మంది ఉన్నారు. ఇక పాకిస్థాన్ నిషేధం లాంటి పక్కన పెట్టి.. దానిని విధ్వసం చేసే దిశగా ఆలోచించాలి. తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాలి అని కంగన సెన్సేషనల్ కామెంట్లు చేశారు.

    మణికర్ణిక విజయోత్సవాలు రద్దు

    మణికర్ణిక విజయోత్సవాలు రద్దు

    పుల్వామా దాడి ఘటన తర్వాత మణికర్ణిక విజయోత్సవ వేడుకలను కంగన రనౌత్ రద్దు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ భద్రతపై దెబ్బ తీయడమే కాకుండా ప్రజల ఆత్మగౌరవంపై దాడి చేశారు. ప్రజలకు భయభ్రాంతులకు చేసేందుకు బెదిరింపు దాడి చేస్తున్నారు అని ఉగ్రవాద మూకలపై ధ్వజమెత్తారు.

    మౌనంగా ఉండొద్దు

    మౌనంగా ఉండొద్దు

    దేశ ప్రతిష్టకు భంగం కలిగే దాడిపైన మౌనంగా ఉండకూడదు. అలా ఉంటే చేతకాని తనమని అనుకొంటారు. మనల్ని తక్కువ అంచనా వేస్తారు. భారత్ రక్తమోడుతున్నది. సైనికులపై దాడితో మన గొంతుకలపై కత్తి పెట్టారు. ఇలాంటి సమయంలో శాంతి, సామరస్యం మాటలు మాట్లాడితే వారి ముఖానికి నల్లరంగు కొట్టాలి. గాడిదపై కూర్చొపెట్టి వీధుల్లో ఊరేగించాలి అని కంగన సెన్సేషనల్ కామెంట్లు చేయాలి.

    కంగన ఎటాక్‌పై షబానా ఆజ్మి స్పందన

    కంగన ఎటాక్‌పై షబానా ఆజ్మి స్పందన

    కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలపై నటి షబానా ఆజ్మీ స్పందించారు. దేశం భావోద్వేగంలో మునిగి సమయంలో నాపై ఆరోపణలు చేయడం వ్యక్తిగత దాడిగానే భావిస్తున్నాను. పుల్వామా విషాద సమయంలో దేశం మొత్తం సైనికులకు అండగా నిలుస్తుంటే.. కంగన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. దేవుడు ఆమెను చల్లగా చూడాలని కోరుకొంటున్నాను అని షబానా అన్నారు.

    English summary
    On Friday, Shabana Azmi and Javed AKhtar got praised by one and all after they declined the invitation to join two-day literary event on her father Kaifi Azmi in Karachi, Pakistan, as a sign of protest against the cowardly Pulwama suicide attack in Jammu and Kashmir by Pakistan-based terror outfit Jaish-e-Mohammed (JeM). However, their act didn't seem to impress 'Manikarnika: The Queen of Jhansi' actor Kangana Ranaut much. In a fresh attack on Bollywood, the actress called Shabana Azmi an anti-national who boosts the morals of the enemies by organizing cultural events in Pakistan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X