For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్యాన్ ఇండియా హీరోలకు కంగనా షాక్.. ఎవరూ చేయని సాహసం!

  |

  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ గా తెరకెక్కుతున్న తలైవి సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంత మంది సినీ ప్రముఖులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన జయలలిత జీవితం గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. ముఖ్యంగా ఆమె రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. బలవంతమైన రాజకీయ నాయకులకు సైతం ధీటుగా నిలిచి.. తమిళనాడు అగ్ర పీఠాన్ని అందుకున్నారు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ లేడి అని కూడా నిరూపించుకున్నారు. ఇక ఆమె ప్రేమ కూడా అలాంటిదే. అభిమానుల చేత అమ్మా అని పిలిపించుకున్న అతి కొద్దిమంది నటీమణుల్లో జయలలిత ఒకరు.

  ఇక అలాంటి గొప్ప నాయకలిరాలి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. ఇక ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీపై గత కొంత కాలంగా అనేక రకాల కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అసలైతే ఈ ఏడాది సమ్మర్ లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా సినిమా వాయిదా పడుతూనే ఉంది. ఎప్పటికప్పుడు అంచనాలు క్రియేట్ చేసే విధంగా కంగనా రనౌత్ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తోంది. ఇక ఈ సినిమాను కేవలం హిందీ లోనే కాకుండా తమిళ్ తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఒక విధంగా కంగనా రనౌత్ క్రేజ్ ద్వారానే ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

  Kangana Ranaut Thalaivii new release date announcement

  ఇక సినిమా విడుదల తేదీని కూడా ఎవరూ ఊహించని విధంగా ప్రకటించారు. ఎందుకంటే ప్రస్తుతం పెద్ద సినిమాలు విడుదల తేదీలను ప్రకటించడానికి కూడా చాలా భయపడుతున్నాయి.
  రీసెంట్ గా అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ సినిమా కలెక్షన్స్ ఏ స్థాయిలో వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద కనీసం 5 కోట్లు కూడా అందుకోకపోవడం ఆశ్చర్యకరం. దీంతో చేసేదేమీ లేక థియేట్రికల్ గా సినిమాను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక ఈ దెబ్బతో పెద్ద సినిమాలన్నీ కూడా ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశం లేదని ఒక క్లారిటీకి వచ్చేశారు.

  కానీ తలైవి సినిమా సెప్టెంబర్ 10 రాబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. అది కూడా సౌత్ నార్త్ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ట్లు పోస్టర్లను కూడా విడుదల చేశారు. కంగనా రనౌత్ ఈ స్థాయిలో సాహసానికి సిద్ధమవుతుందని ఎవరు కూడా ఊహించలేదు. ప్రస్తుతానికైతే థియేటర్స్ నడవడం చాలా కష్టంగా ఉంది. థర్డ్ వేవ్ కూడా త్వరలోనే మొదలు కాబోతున్నట్లు హెచ్చరికలు అందుతున్నాయి. కరోనా తీవ్రత ఏమాత్రం పెరిగినా కూడా మరోసారి సినిమాలు వాయిదా పడక తప్పదు. ఒకవేళ సినిమాలు విడుదలైన కూడా దారుణంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. మరి కంగనా రనౌత్ తన బిగ్ బడ్జెట్ సినిమాతో ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి. ఏఎల్.విజయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

  English summary
  Kangana Ranaut Thalaivii new release date announcement.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X