రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కాళ్లు పట్టుకున్న హీరోయిన్!
Recommended Video

2019లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'మణికర్ణిక-ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ'. రాణి లక్ష్మీ భాయి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ పీరియడ్ డ్రామాలో కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా... చివర్లో కొంత భాగాన్ని కంగన రనౌత్ డైరెక్ట్ చేశారు.
మణికర్ణిక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మంగళవారం ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ సంఘటన బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. బాహుబలి దర్శకుడురాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కాళ్లకు కంగనా నమస్కరించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

కథ అందించింది ఆయనే
‘మణికర్ణిక' చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ నేపథ్యంలో ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడంతో... కంగనాలో ఇలాంటి కోణం కూడా ఉందా? అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. కంగనాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఆశ్చర్య పరిచింది అంటూ ఉమైర్ సంధు ట్వీట్
కంగనా... రచయిత విజయేంద్ర ప్రసాద్ కాళ్లు మొక్కడంపై ఉమైర్ సంధు స్పందిస్తూ... ‘క్లాసిక్ రైటర్ విజయేంద్రప్రసాద్ కాళ్లు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం చూసి ఆశ్చర్యపోయాను. పెద్దలకు ఆమె ఇచ్చే గౌరవం చూసి ముచ్చటేసింది అని ట్వీట్ చేశారు.

మణికర్ణిక
మణికర్ణికగా జన్మించి ఆమె లక్ష్మిభాయిగా ఎలా మారింది. ఎలాంటి పరిస్థితుల్లో ఝాన్సీ రాణిగా బాధ్యతలు చేపట్టింది. తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి చేసిన సాహసాలు, తీసుకున్న నిర్ణయాలు ఇలా ప్రతి అంశం సినిమాలో చూపించబోతున్నారు. ఈ చిత్రం క్రిష్ దర్శకత్వంలో మొలైలైంది. దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయిన అనంతరం పలు కారణాలతో ఆయన తప్పుకోవడంతో.... మిగతా భాగాన్ని కంగనా రనౌత్ తన దర్శకత్వంలో పూర్తి చేశారు.

జనవరి 25న విడుదల
నిర్మాత కమల్ జైన్ జీ స్టూడియోస్‌తో కలిసి దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జనవరి 25న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా ఈ మూవీ విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











