తొడ కొట్టనున్న కంగన రనౌత్.. ప్రతీకారం ఎవరిపై అంటే..

By Rajababu

విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న కంగన రనౌత్‌ మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నది. మహిళ దర్శకురాలు ఐశ్వనీ అయ్యర్ తివారీ రూపొందించే పంగా అనే చిత్రంలో క్రీడాకారిణిగా నటించనున్నది. గతంలో ఐశ్వనీ బరేలి కి బర్ఫీ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఐశ్వనీ చెప్పిన కథ నన్ను కదలించిందని కంగనా రనౌత్ వెల్లడించింది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు...

 క్రీడా నేపథ్యంగా పంగా

క్రీడా నేపథ్యంగా పంగా

కంగన రనౌత్‌తో పంగా అనే చిత్రాన్నిరూపొందిస్తున్నట్టు ఐశ్వనీ అయ్యర్ తివారీ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ చిత్రంలో పంజాబీ గాయని జస్సీ గిల్, సీనియర్ నటి నీనా గుప్తా నటిస్తున్నారు. ఈ సినిమా కుటుంబ కథా నేపథ్యంగా రూపొందుతున్నది. నిర్మాతలు ఈ టైటిల్‌ను ప్రకటించి ఈ చిత్రంలో నటించే నటీనటుల కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించారు.

2019లో విడుదల చేస్తాం

2019లో విడుదల చేస్తాం

నన్ను, నా కథను బలంగా నమ్మి ఈ కథను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్‌కు సంబంధించిన వారి ఫ్యామిలీ సభ్యుల సంపూర్ణ మద్దతు ఉంది. ఈ చిత్రాన్ని హిందీ ఫాక్స్ స్టార్ నిర్మిస్తున్నది. 2019లో ప్రేక్షకుల ముందుకు రానున్నది. పంగా చిత్రం భావోద్వేగాల సంగమం అని ఐశ్వనీ అయ్యర్ తివారీ వెల్లడించింది.

 కంగన రనౌత్ ఎమోషనల్

కంగన రనౌత్ ఎమోషనల్

సినిమా విషయాన్ని పక్కన పెడితే.. నాకు ఎదురైన కష్టసుఖాల్లో నా ఫ్యామిలీ వెంట ఉన్నారు. నా ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ చిత్రంలో కనిపిస్తాయి. జీవితాన్ని తెరకెక్కించడంలో ఐశ్వినిది ప్రత్యేకమైన శైలి. ఆమె రూపొందించిన బరేలి కి బర్ఫీ నాకు బాగా నచ్చిన చిత్రం అని కంగన రనౌత్ వెల్లడించింది.

కబాడ్డీ క్రీడాకారిణిగా

కబాడ్డీ క్రీడాకారిణిగా

పంగా చిత్రంలో నా కెరీర్‌లోనే ఓ ప్రత్యేకమైన చిత్రంగా మారడం ఖాయం. ఈ చిత్రంలో కబాడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నాను. ఈ చిత్రంలోని పాత్ర ఛాలెంజ్‌తో కూడుకొన్నది. ఐశ్వినీ, ఫాక్స్ స్టార్ నిర్మాణ సంస్థతో కలిసి ప్రాజెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అని కంగన రనౌత్ పేర్కొన్నది.

మణికర్ణిక చిత్రంలో

మణికర్ణిక చిత్రంలో

ప్రస్తుతం కంగన రనౌత్ మెంటల్ హై క్యా అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో మణికర్ణిక అనే చిత్రంలో నటిస్తున్నది. చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం 2019 జనవరి 25న రిలీజ్ కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X