twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ’కష్టాల్లో కరణ్ జోహర్.. ఆర్మీని కించపరిచాడు.. పద్మశ్రీని వెనక్కు తీసుకోండి‘

    |

    గుంజన్ సక్సేనా అనే చిత్రం వివాదానికి కేంద్ర బిందువుగా మారడంతో కరణ్‌ జోహర్‌ను టార్గెట్‌గా చేసుకొని కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. ఆయనపై కవితను రాసిన ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ఆయన తీరు ఎండగట్టారు. జాతీయవాదంతో దుకాణం తెరిచిన ఆయన తన సినిమాల్లో దేశభక్తి చూపించడం లేదు. పాకిస్థాన్‌కు అనుకూలంగా సినిమాలు తీస్తూ దేశ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాడంటూ తన కవితలో పేర్కొన్నారు. అనంతరం ఆమె కరణ్‌పై దాడిని మరింత తీవ్రతరం చేశారు. కంగన తాజా ట్వీట్‌లో..

    Recommended Video

    Sushant Singh Rajput సూసైడ్ కారణంగా Bollywood Offers, Karan Johar ని దూరం పెట్టిన Prabhas
    బాలీవుడ్ మాఫియా అంటూ..

    బాలీవుడ్ మాఫియా అంటూ..

    గత కొద్దికాలంగా కరణ్, కంగన రనౌత్ మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. కరణ్ పేరు చెబినే భగ్గుమనే స్థాయికి కంగన చేరుకొన్నది. కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్‌లో పాల్గొన్న తర్వాత కరణ్‌ను నెపోటిజానికి మార్గదర్శకుడు, బాలీవుడ్ మూవీ మాఫియాకు నీవే ఆద్యుడవు అంటూ కంగన ఫైర్ అయ్యారు. తాజాగా గుంజన్ సక్సేనా సినిమా వివాదం, అలాగే సుశాంత్ మరణాలపై ఆమె మండిపడ్డుతున్నారు.

    ఆర్మీని కించపరిచేలా గుంజన్ సక్సేనా

    ఆర్మీని కించపరిచేలా గుంజన్ సక్సేనా

    గుంజన్ సక్సేనాకు ఫ్లయిట్ లెఫ్టినెంట్ శ్రీవిద్య రాజన్ ఉద్దమ్‌పూర్ ఎయిర్‌బేస్‌లో బ్యాచ్‌మేట్. కార్గిల్‌ యుద్ధంలో పోరాడింది తానేనని, గుంజన్ సక్సేనా కాదని ఆమె ధృవీకరించారు. గుంజన్ సక్సేనాలో చూపించిన విధంగా ఆర్మ్ రెజ్లింగ్ సీన్ అవాస్తవం సౌమ్య దిప్తా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే సినిమాలో వాస్తవాలకు, అభూత కల్పన. వైమానిక దళ ప్రతిష్టను దెబ్బతినేలా చిత్రీకరించారనే ఆరోపణల మధ్య సౌమ్య ట్వీట్ అత్యంత ప్రధాన్యతను సంతరించుకొన్నది.

    యూరీ యుధ్ద సమయంలో పాకిస్థాన్‌కు మద్దతు

    యూరీ యుధ్ద సమయంలో పాకిస్థాన్‌కు మద్దతు

    సౌమ్య ట్వీట్‌ను కంగన రనౌత్ రీట్వీట్ చేస్తూ.. ఆర్మీని కించపరుస్తూ దేశ మనోభావాలకు వ్యతిరేకంగా గుంజన్ సక్సేనాను తీశారు. అలాగే యూరీలో జరిగిన సైనిక పోరాటంలో పాకిస్థాన్‌ను కరణ్ జోహర్ సమర్థించారు. ఇలాంటి వ్యక్తిని ప్రభుత్వం గౌరవించడం దారుణం. ఆయనకు ఇచ్చిన పద్మశ్రీని కేంద్ర ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలి అని కంగన రనౌత్ డిమాండ్ చేశారు.

    నాపై అనుచిత వ్యాఖ్యలు

    నాపై అనుచిత వ్యాఖ్యలు

    అలాగే నెపోటిజం, ఫేవరిటం పేరుతో ఎంతో మందిని నటీనటుల కెరీర్‌తో ఆడుకొన్నారు. సుశాంత్‌ను మానసికంగా వేధించారు. నాలాంటి నటిపై అంతర్జాతీయ వేదికలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ నుంచి నన్ను తరిమి వేయాలని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఫోరంలో వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి ఉన్నత సత్కారాలకు అనర్హుడు అంటూ కంగన తన ట్వీట్‌లో ధ్వజమెత్తారు.

    English summary
    Bollywood fire brand actress Kangana Ranaut lashes out Karan Johar over patriotism in Gunjan Saxena. She tweeted that, I request government of India to take KJO’s PadmaShri back,he openly intimidated me and asked me to leave the industry on an international platform,conspired to sabotage Sushanth’s career,he supported Pakistan during Uri battle and now antinational film against our Army.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X