కంగన డ్రీమ్ ప్రాజెక్ట్స్: ఆ ఇద్దరు హీరోలతో.. అలాంటి రీమేక్స్‌లో..

బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న కంగన రనౌత్ బాలీవుడ్‌లో అమీర్ ఖాన్, రణ్‌బీర్ కపూర్‌, రణ్‌వీర్ సింగ్‌తో నటించాలనే కోరికను బయటపెట్టారు. బాలీవుడ్ క్లాసిక్ అభిమాన్ లాంటి చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించాలని ఉందని ఆమె చెప్పారు. సినీ పరిశ్రమలో ఓ గొప్ప నటి అనే ముద్ర పడే చిత్రంలో నటించేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు.

ఇక అమీర్ ఖాన్‌తో కూడా నటించాలని ఉందని, లెజెండ్స్ దిలీప్ కుమార్, మధుబాల కలిసి నటించిన ఓ లవ్ స్టోరీలో ఏదైనా ఒక సినిమా రీమేక్ చేస్తే నటించాలని ఉందని కంగన మనసులో మాట చెప్పింది.

Kangana Ranaut wants act Aamir Khan in love story

ప్రఖ్యాత గాయకుడు కిషోర్ కుమార్ బయోపిక్‌లో మధుబాల పాత్రను చేసే అవకాశం వచ్చింది. దర్శకుడు అనురాగ్ బసు నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా సెట్స్‌పైకి రాకుండానే ఆగిపోయింది. మళ్లీ అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అని కంగన చెప్పారు.

ప్రస్తుతం కబడ్డీ క్రీడా ఆధారంగా ఆశ్వినీ అయ్యర్ తివారీ రూపొందిస్తున్న పంగా చిత్రంలో కంగన రనౌత్ నటిస్తున్నది. అలాగే జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న తలైవి చిత్రంలోనూ, ధాకడ్ అనే హిందీ చిత్రాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X