ఇక నీ అంతు చూస్తా.. నీ పని అయిపోయింది.. కంగనాకు ఆదిత్య చోప్రా బెదిరింపులు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత నెపోటిజంపై ఎక్కువగా చర్చలు వినిపిస్తున్నాయి. అయితే అంతకు పూర్వమే బాలీవుడ్ మాఫియా, బంధుప్రీతిల గురించి గొంతు చించుకుని మొత్తుకుంది కంగనా రనౌత్. కానీ కంగనాను ఏనాడూ ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోలేదు. కానీ సుశాంత్ మరణం తరువాత కంగనా మాటలే నిజమని అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు. అయితే తాజాగా ఓ జాతీయా మీడియాతో మాట్లాడుతూ నెపోటిజం గురించి చెబుతూ.. బాలీవుడ్ పెద్దల గుట్టు విప్పింది.

అలా చేశారు..

అలా చేశారు..

తను వెడ్స్ మను వంటి భారీ హిట్ వచ్చాక తాను స్టార్‌గా మారిపోయానని, వెంటనే 19 బ్రాండ్ కంపెనీలు యాడ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారని కంగనా చెప్పుకొచ్చింది. అయితే అదే సమయంలో 2103లో బ్రేకప్ జరిగిన విషయాన్ని మళ్లీ బయటకు తీసి తనపై ఫిర్యాదు చేసి తన పేరును చెడగొట్టారని, దాంతో ఆ కాంట్రాక్ట్‌లన్నీ రద్దయ్యానని తెలిపింది. అలా తనను ఎంతో హింసించారని చెప్పుకొచ్చింది.

సుల్తాన్ సినిమాను..

సుల్తాన్ సినిమాను..

సుల్తాన్ సినిమాలో నటించమని తనను ఆదిత్య చోప్రా కోరారని కానీ తాను అంగీకరించలేదని తెలిపింది. మొదటగా వారి మేనేజర్ వచ్చి సుల్తాన్ స్క్రిప్ట్ చెప్పారని, అయితే తాను ఖాన్‌లతో సినిమాలు చేయనని, ఆ ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పుకొచ్చింది.

మీడియాలో వచ్చింది..

మీడియాలో వచ్చింది..

అయితే ఇదే విషయమై మీడియా అడిగినప్పుడు సుల్తాన్ సినిమా ఆఫర్‌కు నో చెప్పానని తెలిపింది. అయితే ఆ విషయాన్ని చూసిన ఆదిత్య చోప్రా తెగ ఆవేశపడ్డాడని తెలిపింది. దాంతో తనను చాలా రకాలుగా బెదిరించారని, అంతు చూస్తానని మెసెజ్ కూడా చేశారని కంగనా పేర్కొంది.

Recommended Video

Meera Chopra Vs Jr NTR Fans Issue Maybe A Political Game
నీ పని అయిపోయింది..

నీ పని అయిపోయింది..

యూ ఆర్ ఫినిషిడ్.. అంటూ ఆదిత్యా చోప్రా ఆగ్రహంతో తనకు మెసెజ్‌లు చేశాడని, బెదిరించాడని కంగనా తాజాగా వెల్లడించింది. తన సినిమానే కాదంటావా? అంటూ తనమీద పగబట్టాడని కంగనా పేర్కొంది. సుశాంత్‌ను సైతం అలాగే కావాలనే తొక్కేశారని, చివరకు మరణించేవరకు వదిలపెట్టలేదని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X