కంగన రనౌత్ భారీ విజయం.. గెలుపు తర్వాత సెన్సేషనల్ కామెంట్స్
దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ సంచలన విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ స్థానం నుంచి ఆమె తన సమీప ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై భారీ మెజారిటీతో గెలుపు దక్కించుకొన్నారు. అనంతరం కంగన రనౌత్ మాట్లాడుతూ మండిని వదిలి ముంబైకి వెళ్లనని.. ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతానని చెప్పారు. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళితే.
మండి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన కంగన రనౌత్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై రికార్డు మెజారిటీ సాధించారు. తన సమీప ప్రత్యర్థి విక్రమాదిత్యపై 74755 ఓట్ల మెజారిటీతో విజయాన్ని నమోదు చేసుకొన్నారు. ఈ ఎన్నికల్లో 537022 ఓట్లు సంపాదించుకోగా, విక్రమాదిత్య 462267 ఓట్లు సాధించారు.

రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తొలి ప్రయత్నంలోనే ఎంపీగా విజయం సాధించడం ఓ రికార్డుగా చెప్పుకోవచ్చని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ గుడ్ గవర్నెనెన్స్ చూసి బీజేపీకి ఓటు వేసిన మండి ప్రజలకు నేను రుణపడి ఉంటాను అని అన్నారు.
ముంబైకి వెళ్లడంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ.. ఇది నా జన్మభూమి. ఈ ప్రాంతానికి సేవ చేయడమే నా లక్ష్యం. ప్రధాని నరేంద్రమోదీకి సైనికురాలిగా నేను సేవ అందిస్తాను. నేను ఎక్కడికి వెళ్లను అని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











