కంగనాకు వై సెక్యూరిటీ అవసరమా.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?.. విమర్శలకు నటి కౌంటర్

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకవైపు సుశాంత్ డెత్ కేసు మరోవైపు డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంటే మధ్యలో కాంగనా రనౌత్ పొలిటికల్ వార్ ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమాలు లేకపోయినా కూడా కంగనా నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటుందని మరోసారి నీరూపించింది. ఇక ఆమె పొలిటికల్ వార్ కారణంగా ప్రాణాపాయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

ప్రాణాపాయం ఉన్నందున వై సెక్యూరిటీ

ప్రాణాపాయం ఉన్నందున వై సెక్యూరిటీ

ఇక వై సెక్యురిటీని ఏర్పాటై చేయడంతో అందువల్ల ప్రభుత్వానికి ఎంత ఖర్చవుతొంది అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. తన కార్యాలయం కూల్చివేయడంతో అనేక వివాదాల నడుమ కంగనా సెప్టెంబర్ 9న ముంబై వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడే ఆమెకు ప్రాణాపాయం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం వై సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.

ఫొటోలు వైరల్..

ఫొటోలు వైరల్..

ఇక ఫైనల్ గా సోమవారం కంగనా తన స్వస్థలం మనాలీకి చేరుకోగా ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవ్వగానే ఘన స్వాగతం లభించింది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. కంగనా స్పెషల్ వై సెక్యూరిటీకి సంబంధించిన ఫొటోలు కూడా హాట్ టాపిక్ అవుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు అడ్వొకేట్‌ బ్రిజేష్‌ కలప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.

కంగనా కోసం 10లక్షల ఖర్చు

కంగనా కోసం 10లక్షల ఖర్చు

ఒక వ్యక్తికి వై సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి అంటే ప్రభుత్వంపై నెల రోజులలో దాదాపు 10లక్షల భారం పడుతుంది. అది ప్రజల సొమ్ము. పన్ను ద్వారా వచ్చిన డబ్బును అక్కడ ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో కంగనా క్షేమంగానే ఉన్నారు. ఇక ఇప్పుడైనా ప్రభుత్వం ఆ భద్రత దళాలను వెనక్కి రమ్మని చెబుతుందా? అంటూ కలప్ప సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

కంగనా రనౌత్ కౌంటర్

కంగనా రనౌత్ కౌంటర్

ఇక కంగనా రనౌత్ ఆ కామెంట్స్ పై ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.. కేంద్ర ప్రభుత్వం ఇతరుల ఊహలకు అనుగుణంగా భద్రతను ఇవ్వదు. ఇంటిలిజెన్స్ బ్యూరో నివేదికల ప్రకారం ఎంతవరకు ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని పరిగాణలోకి తీసుకోని సెక్యూరిటీ గ్రేడ్ ని డిసైడ్ చేస్తారు.

Recommended Video

Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
 దేవుడి దయ ఉంటే

దేవుడి దయ ఉంటే

దేవుడి దయ ఉంటే త్వరలోనే ఆ భద్రతను తీసేయవచ్చు. అదే విధంగా ఇంటిలిజెన్స్ బ్యూరో నివేదికలకు అనుగుణంగా ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని తెలిస్తే భద్రత కూడా మరింత ఎక్కువగా పెంచవచ్చు.. అని కంగనా తనదైన శైలిలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక కంగనా చేస్తున్న కొన్ని కామెంట్స్ కి నెటిజన్స్ నుంచి మద్దతు లభిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X