Karan Johar Vs Kangana ఆ ఇద్దరి జీవితాలను నాశనం చేయాలని కుట్ర.. కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు

హిందీ సినీ పరిశ్రమలో మరోసారి బ్యాన్ బాలీవుడ్ ఊపందుకొన్నది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్‌ మాఫియా గురించి నెటిజన్లు కొందరు సినీ ప్రముఖులను టార్గెట్ చేయడం తెలిసిందే. అయితే కొద్దికాలం సద్దుమణిగిందనుకొన్న ఈ ఆన్‌లైన్ ఉద్యమం మళ్లీ ఊపందుకొన్నది. అయితే మరోసారి కరణ్ జోహర్‌ను ప్రధానంగా టార్గెట్ చేసుకొని ట్వీట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కరణ్ జోహర్‌ను ఉద్దేశించి కంగన రనౌత్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఈ బాలీవుడ్ క్వీన్ చేసిన కామెంట్లు ఏమిటంటే?

ఆ ఇద్దరి కెరీర్ గురించి : ఇటీవల ప్రియాంక చోప్రా మీడియాతో మాట్లాడుతూ.. కరణ్ జోహర్ నాకు బాలీవుడ్ అవకాశాలు రాకుండా చేశాడు. నన్ను వాళ్ల గ్రూప్ నుంచి దూరంగా పెట్టాడు అని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ప్రియాంక చోప్రా కామెంట్లకు మద్దతుగా.. అవును.. ప్రియాంక చోప్రా కెరీర్‌ను నాశనం చేయాలని చూశాడు. అంతేకాదు.. అనుష్క శర్మ కెరీర్‌ను కూడా నాశనం చేయాలని ప్రయత్నించాడు అని కంగన కామెంట్ చేసింది.

Karan Johar Vs Kangana

ఇంగ్లీష్ రాదని అవహేళన : హిందీ చిత్ర పరిశ్రమలో ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ కెరీర్స్‌ను నాశనం చేయాలని కరణ్ జోహర్ చూశాడనే టాపిక్ చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై కంగన రనౌత్ స్పందించింది. నన్ను, నా కెరీర్‌ను నాశనం చేయాలని చూశారు. నేను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే.. గేలి చేశారు. ఓ జాతీయ టెలివిజన్ ఛానెల్‌లో నాకు ఇంగ్లీష్ రాదని చులకన చేశారు. అయినా నేను వారి మాటలను పట్టించుకోలేదు అని కంగన చెప్పింది.

కరణ్ జోహర్ రియాక్షన్ :
అయితే కంగన రనౌత్ కామెంట్లపై కరణ్ జోహర్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో స్టాటస్ పెట్టి.. నా మీద ఆరోపణలు చేసుకో. నాపై ఎలాంటి నేరాలైనా పెట్టుకో. మేము ఎవరికి తలవంచే వాళ్లం కాదు. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా.. మేము కిందపడే వాళ్లం కాదు అంటూ కంగనకు కరణ్ జోహర్ నర్మగర్భంగా కామెంట్ చేశాడు.

 Karan Johar Vs Kangana

కరణ్‌కు కంగన కౌంటర్ : అయితే తన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన కరణ్ జోహర్‌పై కంగన కామెంట్ చేస్తూ.. ఒకప్పుడు నాకు ఇంగ్లీష్ రాదని అవమానించిన వ్యక్తి.. ఇప్పుడు దిగివచ్చి.. హిందీలో పోస్టులు పెడుతున్నాడు. ఇంకా ముందు ముందు బాగా మారిపోయే రోజులు వస్తాయి. ఇంకా చాలా చూసేది ఉంది. ముందుంది ముసళ్ల పండుగ అంటూ కంగన రనౌత్ గట్టిగా సమాధానం ఇచ్చింది.

కరణ్‌ను విరాట్ కోహ్లీ కొట్టాడా? : ఇదిలా ఉండగా, ప్రియాంక, అనుష్క శర్మ కెరీర్‌ను నాశనం చేయాలని కరణ్ జోహర్ చూశాడు అని ఇటీవల క్రిటిక్ ఉమేర్ సంధూ కూడా కామెంట్ చేశాడు. కరణ్ జోహర్‌ను చెంప మీద కొట్టి.. అనుష్క శర్మ కెరీర్‌ను అంతం చేయడం నీ బాబు వల్ల కూడా కాదు అని విరాట్ కోహ్లీ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం అనుష్క, ప్రియాంక, కరణ్ జోహర్, కంగన రనౌత్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్‌ ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ఆన్ లైన్ యుద్ధం ఎక్కడి వరకు తీసుకెళ్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X