మా విడాకులకు ఆమె కారణం కాదు: పుకార్లపై భగ్గుమన్న టాప్ హీరోయిన్!

హైదరాబాద్ బ్యూటీ, బాలీవుడ్ నటి దియా మీర్జా తన భర్త సాహిల్ సంఘాతో విడిపోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీరు విడిపోవడానికి కారణం రచయిత కనికా ధిల్లాన్ అనే రూమర్స్ బాలీవుడ్ మీడియాలో గుప్పుమన్నాయి.

కనికా ధిల్లాన్ మరెవరో కాదు... రాఘవేంద్రరావు మాజీ కోడలు. 2014లో ప్రకాష్ కోవెలమూడిని కనికా పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరు విడిపోయి రెండేళ్లు అయిందట. ఈ విషయం ఇటీవలే బయటకు వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో కనికా-ప్రకాష్ తాము 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమా మొదలు పెట్టడానికి ముందే సపరేట్ అయినట్లు తెలిపారు.

బాలీవుడ్ మీడియాలో రచ్చ రచ్చ

బాలీవుడ్ మీడియాలో రచ్చ రచ్చ

ఈ రెండు జంటలు విడిపోయిన విషయం ఒకేసారి బయటకు రావడం, వీరంతా సినిమా రంగానికి చెందినవారే కావడంతో.... కొందరు ఈ రెండు వార్తలకు ముడిపెట్టి కథనాలు అల్లేశారు. ఈ వార్తలు చూసి కనికా ధిల్లాన్‌, దియా మీర్జా ఫైర్ అయ్యారు. మీడియా బాధ్యతగా వ్యవహరించం లేదు అంటూ మండి పడ్డారు.

నా జీవితంలో దియా, సాహిల్‌ను ఎప్పుడూ కలవలేదు

నా జీవితంలో దియా, సాహిల్‌ను ఎప్పుడూ కలవలేదు

‘‘నవ్వుల పాలయ్యేలా, నీచంగా, బాధ్యతా రాహిత్యంగా కథనాలు రాశారు. ఫిక్షన్ రైటింగ్ అనేది నా వృత్తి. కానీ మీడియా వారు అలా రాయకూడదు. మీరు కాస్త బాధ్యతగా వ్యవహరించాలి. కేవలం రెండు వార్తలు ఒకేసారి వచ్చినంత మాత్రాన ఆ రెండింటికీ లింకు పెట్టవద్దు, ఇలా చేయడం సరికాదు. నా జీవితంలో దియా, సాహిల్‌ను ఎప్పుడూ కలవలేదు.'' అని కనికా ధిల్లాన్ వ్యాఖ్యానించారు.

ఈ వార్తలను ఖండించిన దియా మీర్జా, మా విడాకుల వెనక ఏ మహిళా లేదు

ఈ వార్తలను ఖండించిన దియా మీర్జా, మా విడాకుల వెనక ఏ మహిళా లేదు

కనికా ధిల్లాన్ చేసిన ట్వీట్‌కు మద్దతు పలుకుతూ దియా మీర్జా కూడా వరుస ట్వీట్లు చేశారు. ‘‘మీడియా ఇంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తుంది అని ఊహించలేదు. ఆ కథనాలు పూర్తిగా అవాస్తవం. నేను-సాహిల్ విడిపోవడం వెనక ఏ మహిళ లేదు.'' అని చెప్పే ప్రయత్నం చేశారు.

దియా-సాహిల్ విడాకులు

దియా-సాహిల్ విడాకులు

దియా మీర్జా, సాహిల్ సంఘా వివాహం 2014లో జరిగింది. పెళ్లి ముందు నుంచే వీరు కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. ‘‘11 సంవత్సరాలుగా కలిసి ఉంటూ జీవితాన్ని పంచుకున్నాం, ఇపుడు విడిపోయే సమయం వచ్చింది. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. విడిపోయాక కూడా మా మధ్య స్నేహ బంధం కొనసాగుతుంది.'' అని దియా మీర్జా వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే వీరు విడిపోవడానికి గల కారణం ఏమిటనేది బయటకు రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X