twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరినీ ఏకిపారేసిన రాఘవేంద్రరావు కోడలు, కోపానికి కారణం?

    |

    కనికా ధిల్లాన్... బాలీవుడ్లో ఫేమస్ రైటర్. రా.వన్, మన్మర్జియాన్, కేదార్‌నాథ్, మెంటల్ హై క్యా సినిమాలతో పాటు తెలుగులో సైజ్ జీరో చిత్రానికి రచయితగా పని చేశారు. అయితే ఆమె దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కోడలు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. 2014లో కనికా ధిల్లాన్-ప్రకాష్ కోవెలమూడిని పెళ్లాడారు.

    కనికా ధిల్లాన్ తాజా ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ ట్వీట్లో షారుక్ ఖాన్ మూవీ 'జీరో'కు వ్యతిరేకంగా రివ్యూలు రాసిన క్రిటిక్స్‌ను ఆమె తన విమర్శలతో ఏకి పారేశారు. జోరోను ఒక గొప్ప చిత్రంగా పేర్కొంటూ తన తోటి రచయితలకు మద్దతు ప్రకటించారు.

     జీరో

    జీరో

    షారుక్ ఖాన్ నటించిన ‘జీరో' లాస్ట్ ఫ్రైడే విడుదలైంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బువా సింగ్ అనే మరుగుజ్జు మనిషి జర్నీ మీరట్ నుంచి మార్స్ వరకు ఎలా సాగింది అనేది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కథను హిమాన్షు శర్మ రాయగా, అనుశర్మ, కత్రినా కైఫ్ ఫిమేల్ లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రంలో షారుక్ ఖాన్ పెర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు దక్కగా.... సినిమా కొందరు క్రిటిక్స్‌ను నిరాశపరిచింది.

     రివ్యూలు చూసి షాకైన కనికా ధిల్లాన్

    రివ్యూలు చూసి షాకైన కనికా ధిల్లాన్

    ‘జీరో' చిత్రానికి చాలా వరకు నెగెటివ్ రివ్యూలు రావడంతో షాకైన కనికా ధిల్లాన్ సినిమా చూడటానికి వెళ్లారు. అనంతరం తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ రెండు పేజీల నోట్ విడుదల చేశారు. ఇందులో ఆమె రివ్యూలు రాసిన క్రిటిక్స్‌ను విమర్శించే ప్రయత్నం చేశారు.

     2018లో వచ్చిన గొప్ప మూవీ

    2018లో వచ్చిన గొప్ప మూవీ

    ‘జీరో' సినిమాపై కొందరి రివ్యూ చూస్తుంటే.... ఇది రివ్యూనా? లేక సినిమాపై వారి సొంత అభిప్రాయమా? అనేది అర్థం కావడం లేదు. ‘జీరో' చిత్రం చాలా బావుంది. 2018లో వచ్చిన గొప్ప చిత్రాల్లో ఇదీ ఒకటి అని వెల్లడించారు కనికా ధిల్లాన్.

    అయ్యో! షారుక్ ఖాన్ ‘జీరో' బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే...అయ్యో! షారుక్ ఖాన్ ‘జీరో' బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే...

    వారు కొత్తదనం కోసం ప్రయత్నిస్తారు

    'జీరో' దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్, రచయిత హిమాన్షు శర్మ కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటారు. అందుకు 'తను వెడ్స్ మను', 'తను వెడ్స్ మను రిటర్న్స్' వంటి సినిమాలే నిదర్శనం. 'జీరో' ద్వారా మరో కొత్త కోణం చూపించారు. షారుక్ లాంటి పెద్ద హీరో తన ఇమేజ్ పట్టించుకోకుండా ధైర్యంగా ఇలాంటి సినిమా చేశారు..... అంటూ కనికా సినిమాను విమర్శించిన వారిపై తనదైన శైలిలో ఎటాక్ చేశారు.

    విరాట్ కోహ్లి రివ్యూ

    కాగా... ‘జీరో' చిత్రంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మ నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లి స్పందించారు. ‘జీరో' చిత్రం బాగా నచ్చిందని, చాలా ఎంజాయ్ చేశానని, అనుష్క పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుందని ట్వీట్ చేశారు.

    English summary
    "Dedicated to the Screenwriters! Don’t ‘Dwarf’ your dreams! #ZeroReview or is it #reviewingthereview... don’t know... but why zero is one of the most important films of 2018!!! " Kanika Dhillon tweet on Zero movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X