జీవితం విలువ తెలిసింది.. నా పిల్లల్ని చూడాలని ఉంది.. కనికాకపూర్ ఎమోషనల్ పోస్ట్

కరోనావైరస్ బారిన పడిన సింగర్ కనికాకపూర్ ప్రస్తుతం విషమ పరిస్థితులను ఎదుర్కొంటున్నది. గత 15 రోజుల్లో ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో నాలుగోసారి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళన గురవుతున్నారు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలించే వెసులుబాటు లేదాయే అనే విధంగా ఆవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో కనికాకపూర్ ఎమోషనల్ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో..

జీవితం విలువ తెలిసింది

జీవితం విలువ తెలిసింది

అవసరమైన సమయంలో జీవితం అన్నీ నేర్పుతుంది. టైమ్‌ను సరైన రీతిలో వినియోగించుకోవడమనేది ఇప్పుడు నేర్పిన పాఠం. అంతేకాకుండా జీవితం విలువ ఎంత ముఖ్యమైనదో అనేది సమయం కూడా తెలియజేస్తుంది అంటూ తన ట్వీట్‌లో ఓ పోస్టర్‌ను పెట్టింది.

పిల్లల్ని మిస్ అవుతున్నా

నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న ప్రతీ ఒక్కరికి ప్రేమతో కూడిన ధన్యవాదాలు. విపత్కర పరిస్థితుల్లో నాపై కురిపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్. ఇంటి వద్దనే జాగ్రత్తగా ఉండండి. తదుపరి నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ వస్తుందని భావిస్తున్నా. ఇంటికి వెళ్లి నా పిల్లలను, ఫ్యామిలీని చూడాలనే కోరిక కలుగుతున్నది. వారిని మిస్ అవుతున్నాను. నేను ఐసీయూలో లేను అని కనికాకపూర్ తన ట్వీట్‌లో పేర్కొన్నది.

నాలుగోసారి పాజిటివ్

నాలుగోసారి పాజిటివ్


బాలీవుడ్, టాలీవుడ్‌లో గాయనిగా మంచి పేరు సంపాదించుకొన్న కనికాకపూర్‌కు ముగ్గురు సంతానం. దాదాపు నెలరోజులకుపైగా కనికా తన పిల్లలకు దూరంగా ఉంటున్నారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో మార్చి 20వ తేదీన ఆమెను హాస్పిటల్‌లో చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన రోగ నిర్ధారణ పరీక్షలో నాలుగోసారి పాజిటివ్‌గా రావడం చర్చనీయాంశమైంది.

Recommended Video

Janhvi Kapoor, Pooja Hegde are Heroines For NTR Trivikram Movie
లక్నోలో ఎఫ్ఐఆర్ నమోదు

లక్నోలో ఎఫ్ఐఆర్ నమోదు


కాగా, లండన్ నుంచి వచ్చిన కనికాకపూర్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా హై ప్రొఫైల్ పొలిటిషన్స్ పాల్గొన్న విందుకు హాజరుకావడం, అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఆమె లక్నో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188, 269, 270 ప్రకారం లక్నో సరోజినినగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు ఊపందుకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X