twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే నోరు మూసుకొన్నా.. అప్పుడే గుట్టు బయటపడుతుంది.. కనికా కపూర్

    |

    బాలీవుడ్ సింగర్ కనికాకపూర్‌కు కరోనావైరస్ పాజిటివ్ తేలడంతో దేశవ్యాప్తంగా వివాద అంశాల్లో ఒకటిగా మారింది. మార్చి 20న నిర్వహించిన నిర్దారణ పరీక్షల్లో కనికా కరోనా బారిన పడ్డారనే విషయంతో ఒక్కసారిగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఉలిక్కి పడ్డారు. అందుకు కారణం మాజీ సీఎం వసుంధరా రాజే కుటుంబంలో జరిగిన ఓ విలాసవంతమైన విందుకు ఆమె హాజరుకావడమే. ఆ తర్వాత అనేక రూమర్లు, ఊహాగానాలు ఆమెను చుట్టుముట్టాయి. తాజాగా ఆమె కరోనా నుంచి కోలుకొని లక్నోలోని తన కుటుంబ సభ్యులతో లాక్‌డౌన్ పిరియడ్‌ను కొనసాగిస్తున్నారు. తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు మళ్లీ అందరి కనుబొమ్మలు ఎగిరేసేలా చేశాయి. ఆమె పెట్టిన సుదీర్ఘమైన పోస్టులో ఏమున్నదంటే..

    Recommended Video

    Ranbir Kapoor About His Breakup With Deepika Padukone
    నేను కలిసిన వ్యక్తులకు..

    నేను కలిసిన వ్యక్తులకు..

    యూకేలో గానీ, ముంబైలో గానీ, లేదా లక్నోలో గానీ నేను కలిసిన వ్యక్తుల్లో ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించలేదు. నాకు కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత వారికి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే నెగిటివ్ అని తేలింది. అయినా నన్ను దోషిగా చూపిస్తూ అనేక కథనాలు, కట్టుకథలు బయటకు వదిలారు. వాటికి కాలమే సమాధానం చెబుతుంది అని కనికాకపూర్ తన పోస్టులో పేర్కొన్నారు.

    నావైపు కొంత తప్పు ఉంది

    నావైపు కొంత తప్పు ఉంది

    నాపై వచ్చిన కథలు, వార్తలు, రూమర్లపై నేను స్పందించదలచుకోలేదు. ఎందుకంటే నావైపు కొంత తప్పు జరిగింది కనుక నేను ఏమీ మాట్లాడటం లేదు. అయితే ఆ విషయంలో చాలా తప్పుడు సమాచారం, తప్పుడు ప్రచారం దండిగా జరిగింది. నా విషయంలో జరిగిన తప్పుడు ప్రచారానికి కాలమే సమాధానం చెప్పాలని నేను భావిస్తున్నాను. ఒకరోజు తప్పుకుండా అసలు విషయం బయటకు వస్తుంది. నాపై కట్టు కథలు అల్లిన వాళ్లు తప్పుకుండా వారి చేసిన తప్పులకు పశ్చాత్తాపం పడుతారు అని కనికా కపూర్ అభిప్రాయపడ్డారు.

    రకరకాల వెర్షన్లలో నాపై కథనాలు

    రకరకాల వెర్షన్లలో నాపై కథనాలు

    మార్చి 10వ తేదీన లక్నోకు చేరుకొన్న సమయంలో ఎయిర్‌పోర్టులో డొమెస్టిక్ ఫ్లయిట్ పాసింజర్స్‌కు నిర్వహించడానికి స్క్రీనింగ్ సదుపాయాలు లేవు. నేను ఎలాంటి పార్టీలు ఇవ్వలేదు. కానీ మార్చి 15న నా స్నేహితులు ఇచ్చిన లంచ్, డిన్నర్ పార్టీలకు హాజరయ్యాను. కానీ నా గురించి ఏవో కథలు పలు రకాల వెర్షన్లలో వచ్చాయి. అయినా ఇప్పటి వరకు నోరు విప్పడం లేదు అని కనికా కపూర్ అన్నారు.

    మూడుసార్లు నెగిటివ్ అని తేలిన తర్వాతే

    మూడుసార్లు నెగిటివ్ అని తేలిన తర్వాతే


    నాకు మార్చి 17, 18 తేదీల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. మార్చి 19న నాకు నిర్ధారణ పరీక్షలు నిర్వహంచారు. మార్చి 20న పాజిటివ్ అని తేలింది. దాంతో హాస్పిటల్‌లోనే ఉండాలని చెప్పారు. ఆ తర్వాత పలు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలడంతో మూడు వారాలు హాస్పిటల్‌లోనే ఉన్నాను. ఆ తర్వాత మూడు నెగిటివ్ టెస్టులు రావడంతో నన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేశారు అని కనికా కపూర్ తెలిపారు.

    కనికా కపూర్ సుదీర్ఘమైన లేఖ

    కరోనా వ్యాధి నుంచి బయటపడిన తర్వాత కనికా కపూర్ పెట్టిన సుదీర్ఘమైన లేఖ ఇదే..

    English summary
    Kanika Kapoor given detailed clarity in instagram about the story behind her covid19 incident. Kanika Kapoor clarified saying, "every person that I have come in contact with be it in UK, Mumbai or Lukcjnow has shown no symptoms of COVID-19.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X