twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కనికాకపూర్‌కు ఆరోసారి కరోనా నెగిటివ్.. నో డిశ్చార్జి.. పొంచి ఉన్న మరో ప్రమాదం!

    |

    బాలీవుడ్ సింగర్ కనికాకపూర్‌కు ఉపశమనం లభించింది. శనివారం ఆరోసారి నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో కరోనావైరస్ నెగిటివ్ అని తేలింది. దాంతో కుటుంబ సభ్యులు కాస్త ఊరట చెందారు. కనికాకపూర్‌పై కరోనా ప్రభావం తగ్గిందని, త్వరలోనే ఆమెను డిశ్చార్జ్ చేసే అవకాశం ముందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఒకవేళ డిశార్జ్ అయితే కనికాకు మరో ప్రమాదం పొంచి ఉందనే వాదన మొదలైంది. అదేమిటంటే..

    మార్చి 20 నుంచి నిర్బంధం

    మార్చి 20 నుంచి నిర్బంధం

    లండన్ నుంచి వచ్చిన కనికాకపూర్ కరోనా వ్యాధి లక్షణాలతోనే పలు విలాసవంతమైన పార్టీలలో పాల్గొన్నారు. వీవీఐపీ హోదా ఉన్న మాజీ సీఎం వసుంధరరాజే కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్ ఇంట్లో జరిగిన బర్త్ డే ఫంక్షన్‌కు హాజరయ్యారు. కనీసం ఆ పార్టీకి 400 మంది హాజరయ్యారనే విషయాన్ని కనికా కపూర్ తండ్రి చెప్పడం మరింత వివాదంగా మారింది. మార్చి 20న ఆమెపై కేసు నమోదు చేసి హస్పిటల్‌లో నిర్బంధించి చికిత్సనందిస్తున్నారు.

    కనికాపై పరీక్షలు ఇలా..

    కనికాపై పరీక్షలు ఇలా..

    సింగర్ కనికాకపూర్ మార్చి 9న లండన్ నుంచి లక్నోకు వచ్చింది. అమెకు మార్చి 20వ తేదిన కొవిడ్ 19 పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత మార్చి 24 రెండోసారి, మార్చి 28న మూడోసారి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత మార్చి 30న నాలుగోసారి పాజిటివ్‌గా తేలింది. తాజాగా 31న వెల్లడైన రిపోర్టుల్లో ఐదోసారి కూడా పాజిటివ్ అని వెల్లడైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 3, 4 తేదీలలో నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది.

    ఆరోసారి నెగిటివ్‌గా.. కానీ

    ఆరోసారి నెగిటివ్‌గా.. కానీ

    ఇలాంటి పరిస్థితుల్లో సింగర్‌ కనికాకపూర్‌కు ఆరోసారి నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో నెగిటివ్ అని తేలింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో లక్నోలోని పీజీఐ హాస్పిటల్‌లోనే ఉండాలి. ఆమెకు మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తున్నాం. అందులో కూడా నెగిటివ్ వస్తే ఆమెను డిశ్చార్జ్ చేయడానికి ప్రయత్నిస్తాం. అప్పటి వరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలి అని సంజయ్ గాంధీ పీజీఐఎమ్ఎస్ వైద్యులు పేర్కొన్నారు.

    పలు సెక్షన్ల కింద కేసులు

    పలు సెక్షన్ల కింద కేసులు

    కాగా, కనికా కపూర్‌పై భారతీయ శిక్షాసృతి కింద పలు సెక్షన్లలో కేసులు నమోదయ్యాయి. హాస్పిటల్ ఛీప్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు ఆమెపై సెక్షన్ 188, 269, 270 కింద కేసు నమోదు చేశారు. అలాగే ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం గమనార్హం. ఈ క్రమంలో కరోనా నుంచి బయటపడినా.. ఆమెను ఈ వ్యాధి మరో రూపంలో వెంటాడటం ఖాయమనే మాట వినిపిస్తున్నది.

    Recommended Video

    Janhvi Kapoor, Pooja Hegde are Heroines For NTR Trivikram Movie
    ఆరోగ్యం మెరుగుపడితే పోలీసుల అదుపులోకి

    ఆరోగ్యం మెరుగుపడితే పోలీసుల అదుపులోకి

    ఇదిలా ఉండగా, కనికాకపూర్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగపడగానే ఆమెను అదుపులోకి తీసుకొంటారనే ఊహాగానాలు ఉత్తరప్రదేశ్‌లో మొదలయ్యాయి. కరోనావైరస్ పరీక్షల్లో నెగిటివ్ అని తేలగానే ఆమెను అరెస్ట్ చేసి విచారించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది.

    English summary
    Kanika Kapoor's sixth COVID-19 test result comes negative: Bollywood Singer Kanika Kapoor tests positive for Coronavirus fourth consecutive time: Reports suggest that Singer #KanikaKapoor tests positive for #COVID19. She returned from UK last Sunday, sneaked out, hidden travel history from authorities. Upon return, stayed in a 5star &attended a party with 400+ present.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X