కనికాకపూర్ పరిస్థితి విషమం? నాలుగోసారి కూడా.. దేవుడిపైనే కుటుంబం భారం
కొరోనావైరస్ బారిన పడిన సింగర్ కనికాకపూర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందనే వార్తలు జాతీయ మీడియాలో వెలువడుతున్నాయి. గత 15 రోజుల్లో నాలుగోసారి కరోనావైరస్ పాజిటివ్‌గా రావడంతో కుటుంబం ఆందోళనలో మునిగిపోయారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి దారుణంగా ఉందనే వార్తలు రావడం లక్నోలో పరిస్థితి గంభీరంగా మారింది. వివరాల్లోకి వెళితే..

రెండువారాల క్రితం లండన్ నుంచి
లండన్ నుంచి రెండు వారాల క్రితం లక్నోకు చేరుకొన్న కనికాకపూర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు తలెత్తాయి. ఎయిర్‌పోర్టు అధికారుల నిర్వహించే వ్యాధి నిర్ధారణ పరీక్షలకు హాజరవ్వకుండా దొంగదారిన ఫైవ్‌స్టార్ హోటల్‌కు చేరుకోవడం వివాదంగా మారిన విషయం తెలిసిందే.

లక్నోలో మాజీ సీఎం పార్టీకి
అయితే కనికాకపూర్ కరోనా వ్యాధి లక్షణాలతోనే మాజీ సీఎం వసుంధరరాజే కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్ ఇంట్లో జరిగిన బర్త్ డే ఫంక్షన్‌కు హాజరయ్యారు. కనీసం ఆ పార్టీకి 400 మంది హాజరయ్యారనే విషయాన్ని కనికా కపూర్ తండ్రి చెప్పడం మరింత వివాదంగా మారింది. మార్చి 20న ఆమెపై కేసు నమోదు చేసి హస్పిటల్‌లో నిర్బంధించి చికిత్సనందిస్తున్నారు.

లక్నోలోని హాస్పిటల్‌లో చికిత్స
ఈ క్రమంలో కనికాకపూర్‌పై లక్నో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆదివారం వచ్చిన రిపోర్టుల్లో పాజిటివ్ రావడం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించిదనే విషయాన్ని కుటుంబ వర్గాలే చెప్పడం ఆందోళనకరంగా మారింది.

ట్రీట్‌మెంట్‌కు స్పందించడం లేదు
కనికాకపూర్ ఆరోగ్యపరిస్థితిపై కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. తాజా టెస్ట్ రిపోర్టులతో మా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. లాక్‌డౌన్ సమయంలో ట్రీట్‌మెంట్‌కు ఆమె శరీరం స్పందిచడం లేదనే విషయం అర్ధమవుతున్నది. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలించే పరిస్థితి లేదు. ఆమె త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించడం తప్ప మరోదారి కనిపించడం లేదు అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











