హీరోయిన్ దగ్గర లోదుస్తుల గురించి.. సిగ్గుతో కళ్ళు మూసేసుకుని!

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సరదా మనిషి. ఇటీవల కరణ్ జోహార్, కాజోల్ ఇద్దరూ కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. కరణ్ జోహార్ హోస్ట్ గా కాఫీ విత్ కరణ్ అనే షో జరుగుతోంది. ఈ షోలో సినీప్రముఖులు, క్రీడా ప్రముఖులు పాల్గొంటున్నారు. కరణ్ జోహార్ ఈ షోలో తనదైన శైలిలో అతిథులుగా హాజరైన వారిని సరదా ప్రశ్నలు అడుగుతున్న సంగతి తెలిసిందే. కపిల్ శర్మ షోలో కరణ్ జోహార్ కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు కరణ్ జోహార్ ఇచ్చిన సమాధానంతో కాజోల్ సిగ్గుతో తెగ ఇబ్బందిపడిపోయింది.

ఔట్ డోర్ షూటింగ్స్

ఔట్ డోర్ షూటింగ్స్

గతంలో అవుట్ డోర్ షూటింగ్ కు వెళ్ళినప్పుడు మీరు అండర్ వేర్స్ ని సపరేటుగా సూట్ కేసులో తీసుకుని వెళతారా అని కరణ్ జోహార్ ని కపిల్ శర్మ ప్రశ్నించాడు. కపిల్ అడిగిన ప్రశ్నకు పక్కనే ఉన్న కాజోల్ ఆశ్చర్యపోయింది. దీనితో కరణ్ జోహార్ ఎలాంటి సమాధానం ఇస్తాడా అని అతడి వంక అదోలా చూసింది. కరణ్ జోహార్ పరిస్థితి కూడా అంతే. కపిల్ అడిగిన ప్రశ్నకు కరణ్ కు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు.

లోదుస్తుల గురించి

లోదుస్తుల గురించి

కపిల్ అడిగిన ప్రశ్నకు కరణ్ జోహార్ నిదానంగా తేరుకుని అంతే ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. గతంలో ఔట్ డోర్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు లాండ్రీ సౌకర్యం ఉండేది కాదు. అందుకోసం ప్రత్యేకంగా సూట్ కేసులో షూటింగ్ జరిగే రోజులన్నింటికీ సరిపడా అండర్ వేర్లు తీసుకుని వెళ్ళేవాడిని. రోజుకొకటి వాడి పడేసే వాడిని అంటూ చాలా సరదాగా సమాధానం ఇచ్చాడు. అన్ని కలర్ ఫుల్ గా ఉండే అండర్ వేర్లనే తీసుకుని వెళ్ళేవాడిని అని తెలిపాడు.

సిగ్గుతో కళ్ళు మూసుకున్న కాజోల్

సిగ్గుతో కళ్ళు మూసుకున్న కాజోల్

కరణ్ జోహార్ చెప్పిన సమాధానానికి కాజోల్ ఇబ్బంది పడిపోయింది. తనని పక్కనే పెట్టుకుని వీరిద్దరూ లోదుస్తుల గురించి మాట్లాడుకోవడంతో సిగ్గుతో కళ్ళు మూసేసుకుంది. అంతటితో కరణ్ జోహార్ ఆగలేదు.. నీవు ఎలాంటి అండర్ వేర్లు వాడతావు అంటూ కపిల్ శర్మని ప్రశ్నించాడు. కపిల్ శర్మ కూడా సరదాగానే సమాధానం ఇచ్చాడు. తాను ఎప్పుడూ ఒకే రకమైన అండర్ వేర్లు ఉపయోగించనని, ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటానని తెలిపాడు.

భారీ చిత్రాలతో

భారీ చిత్రాలతో

కరణ్ జోహార్ ప్రస్తుతం భారీ చిత్రాలని నిర్మిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మించిన కళంక్ చిత్రం ఇటీవల విడుదలయింది. ఈ చిత్రం డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, అలియాభట్ నటించిన ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. అలియా భట్, రణబీర్ కపూర్ నటిస్తున్న బ్రహ్మాస్త్ర చిత్రానికి కూడా నిర్మాత కరణ్ జోహారే. జాన్వీ కపూర్ తో మరో చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X