twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తండ్రి కాబోతున్న టాప్ కమెడియన్.. భార్య ఆరోగ్యంపై ఆందోళనతో..

    |

    టెలివిజన్ రంగంలోనూ, వినోద పరిశ్రమలో టాప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకొన్న కపిల్ శర్మకు అన్నీ కలిసి వస్తున్నాయి. మళ్లీ ఆయన హోస్ట్‌గా వ్యవహరించే కపిల్ శర్మ కామెడీ షో మళ్లీ దిగ్విజయంగా ప్రసారం అవుతున్నది. అంతేకాకుండా గతేడాది పెళ్లి చేసుకొన్న కపిల్ శర్మ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. అయితే తన భార్య ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చూస్తూ బాలీవుడ్ మీడియాతో మాట్లాడారు. కపిల్ ఆందోళన చెందడానికి కారణమేమిటంటే..

    డిసెంబర్‌లో తండ్రి కాబోతున్న కపిల్ శర్మ

    డిసెంబర్‌లో తండ్రి కాబోతున్న కపిల్ శర్మ

    నా భార్య గిన్నీచత్రాత్ ప్రస్తుతం గర్భవతి. డిసెంబర్‌లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. గిన్నీని జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో అందుకు తగిన చర్యలు తీసుకొంటున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో సంరక్షణ కోసం కపిల్ తల్లి కూడా ముంబైకి చేరుకొన్నారు.

    నా భార్య ఆరోగ్యం గురించి

    నా భార్య ఆరోగ్యం గురించి

    ఈ సందర్భంగా కపిల్ శర్మ మాట్లాడుతూ.. ప్రస్తుతం నా భార్య ఆరోగ్యం తప్ప మరో విషయంపై దృష్టిపెట్టడం లేదు. ఆమె సంరక్షణ కోసమే సమయాన్ని కేటాయించాలనుకొంటున్నాను. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను, నా భార్య, కుటుంబ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇలాంటి క్షణాల కోసమే ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నాం అని అన్నారు.

    అబ్బాయా? అమ్మాయా? అనే

    అబ్బాయా? అమ్మాయా? అనే

    మాకు సంతానం కలుగుతుందనేదే పెద్ద సంతోషకరమైన వార్త. అబ్బాయా? లేదా అమ్మాయా? అనే విషయంపై పట్టింపు లేదు. అబ్బాయి పుట్టినా.. లేదా అమ్మాయి పుట్టినా ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. మా కుటుంబంలోకి అడుగుపెట్టే చిన్నారి కోసం అందరం వేచి చూస్తున్నాం అని కపిల్ శర్మ పేర్కొన్నారు.

    బుల్లితెరపై కపిల్ శర్మ

    బుల్లితెరపై కపిల్ శర్మ

    ది కపిల్ శర్మ షోకు మంచి ఆదరణ దక్కుతున్నది. బుల్లితెరపై టాప్ ర్యాంకింగ్ ఉన్న షోగా దూసుకెళ్తున్నది. ప్రస్తుతం భార్య గర్బవతి అని తెలిసినప్పటి నుంచి నా ప్రొగ్రామ్స్‌ను షెడ్యూల్ చేసుకొన్నాను. వాటి ఆధారంగా నేను నా సమయాన్ని కేటాయిస్తున్నాను. నా భార్యను కంటికి రెప్పలా చూసుకోవడానికి ఎన్ని కార్యక్రమాలను సర్దుబాటు చేసుకొంటున్నాను అని కపిల్ శర్మ వెల్లడించారు.

    English summary
    DNA reports that, Kapil Sharma and wife Ginni Chatrath, who tied the knot last year in the month of December are all set to embrace parenthood. The couple found out about this happy news just a few months back and now they have even headed for their babymoon as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X