ఆంగ్లేయులు మళ్లీ దోచుకొన్నారు.. ప్రియాంక చోప్రా పెళ్లిపై హాట్ కామెంట్
హిందీ టెలివిజన్ రంగంలో ది కపిల్ శర్మ షో నిర్వహించే టాప్ కమెడియన్ కపిల్ శర్మ పంచ్‌లు వేయడంలో దిట్ట అనే సంగతిని కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ షోలో పాల్గొనే వారిని నవ్వుల్లో ముంచెత్తడం సర్వసాధారణం. ఈ పాపులర్ షోకు తాజాగా బాలీవుడ్ తారలు పరిణితి చోప్రా, సిద్ధార్థ్ మల్హోత్రాలు హాజరయ్యారు. వీరిద్దరు త్వరలో రిలీజ్ కాబోయే జబరియా జోడి సినిమా ప్రమోషన్ కోసం ది కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. కాగా ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు పరిణితి చోప్రా సోదరి అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియాంక పెళ్లిని ఉద్దేశించి కపిల్ శర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
గతంలో భారత దేశాన్ని ఆంగ్లేయులు దోచుకువెళ్లిన సంగతి తెలిసిందే. వారిని సుదీర్ఘమైన పోరాటం తర్వాత దేశం నుంచి వెళ్లగొట్టిన విషయం విధితమే. తాజాగా మరోసారి ఆంగ్లేయులు దోపిడికి పాల్పడ్డారని పరిణితిని ఉద్దేశించి కపిల్ శర్మ అన్నారు.

అయితే కపిల్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరిగా వెలుగలేదు. దాంతో ప్రియాంకను నిక్ జోనస్ పెళ్లి చేసుకోవడం ద్వారా ఆంగ్లేయులు ప్రియాంక అందాల సంపదను మరోసారి దోపిడికి పాల్పడ్డారని అనడంతో పరిణితి చోప్రా పడిపడి నవ్వింది. జబరియా జోడి సినిమా ప్రమోషన్‌లో పరిణితి, సిద్ధార్థ్ బిజీగా ఉన్నారు. బీహార్‌లో పెళ్లి కొడుకును ఎత్తుకెళ్లే అంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











