ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత..

Bollywood: గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల మరణంతో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇండస్ట్రీ అద్భుత హాస్య నటుడిని కోల్పోయింది. గత కొంతకాలంగా కాన్యర్స్ తో పోరాడుతున్న ' ది కపిల్ శర్మ ' షో ఫేమ్ హాస్య నటుడు కన్నుమూశారు.

ప్రముఖ నటుడు, 'ది కపిల్ శర్మ' షో ఫేమ్ అతుల్ పర్చురే (Atul Parchure) గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి (అక్టోబర్ 14న) తుది శ్వాస విడిచారు. ఆయన 'ది కపిల్ శర్మ షో'తో సహా అనేక టీవీ సీరియల్స్ ,చిత్రాలలో నటించి మంచి పాపులర్టీ తెచ్చుకున్నారు. అతుల్ పర్చురే గత ఏడాది కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ఆయన మృతితో వినోద ప్రపంచంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Kapil Sharma Show fame Actor Atul Parchure passes away after a battle with cancer

అతుల్ పర్చురే తన కేరీర్ నాటకాలను నుంచి ప్రారంభించాడు. నాటకం, సినిమాలు, సీరియల్స్ అనే మూడు రంగాల్లోనూ తనదైన ముద్ర వేశారు. మరాఠీ, హిందీ చిత్రాలలో కూడా ఎన్నో అద్భుతమైన హాస్య పాత్రలను పోషించాడు. ప్రధానంగా 'RK లక్ష్మణ్ కి దునియా', 'జాగో మోహన్ ప్యారే', 'యామ్ హై హమ్', 'బడి దూర్ సే ఆయే హై', 'ది కపిల్ శర్మ షో', వంటి మరాఠీ సీరియల్స్, ప్రసిద్ధ కామెడీ షోలలో కనిపించి.. తన కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు..

అతుల్ పర్చురే కి..ప్రముఖ బాలీవుడ్ నటుడు కరణ్ హోస్ట్ గా చేస్తున్న కపిల్ శర్మ షో తో ఆయనకు ఫేమ్ పేరు వచ్చింది. ఈ సమయంలో తనకు కాన్సర్ ఉండని తెలిసింది. క్యాన్సర్ చికిత్స కారణంగా చాలా కాలంగా షూటింగ్ లకు దూరమయ్యారు. అలీబాబా ఆని చలిషితలే చోర్‌ అనే మరాఠీ చిత్రంతో తిరిగి ఇండస్ట్రీలో కనిపించారు. తన రీ ఎంట్రీలో ప్రేక్షకుల తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాను ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న అందరికీ నవ్వులు పంచేవాడు. అతుల్ పర్చూర్ మరణవార్త తెలియడంతో అటు హింది, ఇటు మరాఠీ ఇండస్ట్రీలో విషాదచాయాలు ఏర్పడ్డాయి.

అతుల్ పర్చురే తెలుగు మూవీస్ లో కూడా నటించారు. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నిధి శెట్టి జంటగా నటించిన రూల్స్ రంజన్ మూవీలో అతుల్ పర్చురే నటించాడు. అయితే.. ఈ మూవీ అంతగా ఆడలేదు. ఈయన క్యారెక్టర్ కు కూడా పేరు కూడా రాలేదు. దీంతో బాలీవుడ్ కే పరిమితం అయ్యారు అతుల్ పర్చురే. అతుల్ పర్చురే మరణం పరిశ్రమకు తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X