కరణ్ జోహార్ సీరియస్ .. ఒకేసారి 14 మంది దర్శకులతో కొత్త సినిమాలు
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శక నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ గత కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా నెపోటిజమ్ విమర్శలతో ఆయన ఇటీవల చాలానే ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అనంతరం కరణ్ జోహార్ సినిమాలపై కూడా నిత్యం విమర్శలు వస్తూనే ఉన్నాయి.
ఆయన తన ధర్మ ప్రొడక్షన్ లో నిత్యం స్టార్స్ పిల్లలకి మాత్రమే అవకశాలు ఇస్తారని కొత్తవాళ్లకు ఏ మాత్రం ఛాన్సులు ఇవ్వరని ఎదిగేవాళ్ళను కూడా తొక్కేస్తారని విమర్శించారు. అయితే ఆ విమర్శలకు ఒకే తరహాలో కౌంటర్ ఇవ్వాలని కరణ్ జోహార్ గట్టిగాన్స్ ఫిక్స్ అయినట్లు ఉన్నారు. అందుకే ఒకేసారి 14మంది కొత్త దర్శకులను పరిచయం చేయబోతున్నట్లు ఫొటో షూట్ నిర్వహించి మరి క్లారిటీ ఇచ్చారు.

గతంలో కూడా కరణ్ జోహార్ కొంతమంది న్యూ కమర్స్ కు ఛాన్సులు ఇచ్చారు. కానీ అంతగా పబ్లిసిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఏకంగా 14 మంది యువ దర్శకులతో ఒకేసారి సినిమాలను సెట్స్ పైకి తీసికురానున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. చూస్తుంటే కరణ్ జోహార్ ఎదో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ 14 మంది దర్శకులు ఎంతవరకు క్లిక్కవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications