చప్పుడు చేయని కరణ్... వదిలిపెట్టని ట్రాల్స్...
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానంతరం, బంధుప్రీతికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్ పై నెటిజెన్లు దుమ్మెత్తి పోస్తున్న సంగతి తెలిసిందే. అందరి దృష్టిలో పెద్ద విలన్ గా మారిన కరణ్ పై, బాలీవుడ్ క్వీన్ కంగనా సైతం విమర్శల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ కు సోషల్ మీడియాలో నివాళులు అర్పించిన కరణ్, ఇక అప్పటి నుంచి ఈ వేదికకు దూరంగానే ఉంటున్నాడు.
త్వరలోనే శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తో తాను నిర్మించిన గుంజన్ సక్సేనా చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నప్పటికీ, సినిమా ప్రచారం నిమిత్తం కూడా కరణ్ ఎక్కడా చప్పుడు చేయడంలేదు. సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కరణ్, ఇలా మిన్నకుండిపోవడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. ఇక చాలా కాలం తరువాత ఇటీవలే రణ్ వీర్ సింగ్ చేసిన ఇన్స్టా లైవ్ కు రెండు స్ల్మైలీలు పంపించి మళ్లీ మాయమైపోయాడు.

కరణ్ సోషల్ మీడియాలో ఏ మాత్రం చప్పుడు చేయకపోయినా, ట్రాలర్స్ మాత్రం అతడిని ఊరికనే ఉండనివ్వడంలేదు. సుశాంత్ మరణానికి అతడే కారణమంటూ అన్ని అకౌంట్స్ లోనూ విమర్శలు వెల్లువెత్తుతుండగా, కొంతమంది బెదిరింపులకు సైతం తెగబడుతున్నారు. అతడి కుటుంబాన్ని నాశనం చేస్తామన్న బెదిరింపులు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీంతో కరణ్ ఈ బెదిరింపులపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది.
కరణ్ లీగర్ టీమ్ తో పాటూ, ఆన్ లైన్ టెక్ ఎక్స్ పర్ట్సలు సైతం వివిధ సామాజిక మాధ్యమాల్లో అతడికి వచ్చిన బెదిరింపులను పరిశీలిస్తున్నారు. వీటికి సంబంధించిన సమాచారం సేకరించి, సంబంధిత అధికారులకు అందజేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











